Wedding Dates: 2025
Wedding Dates: 2025లో పెళ్లి కాబోతోందా? అయితే ఈ 40 ముహూర్తాల్లో ఓ డేట్ ఫిక్స్ చేసుకోగలరు.
అందరి జీవితాల్లో వివాహం చేసుకోవడం అనేది పెద్ద నిర్ణయం. పెళ్లి చేయడమనేది అతిపెద్ద బాధ్యత. అందుకే మంచి ముహూర్తాలు ఎంచుకుని మరీ కల్యాణం జరిపిస్తారు.
ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు శుభవార్త. 2025లో జనవరి 14న మకర సంక్రాంతితో శుభ ముహూర్తాలు మొదలవుతాయి. శ్రీధరి పంచాంగ్ ప్రకారం 2025లో పెళ్లిళ్లకు మొత్తం 40 శుభ ముహూర్తాలు ఉన్నాయి.
ఈసారి 2024తో పోలిస్తే కొన్ని తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. అయినా ప్రత్యేకంగా కొన్ని మంచి తేదీలు ఉన్నాయి. ఈ తేదీలు పెళ్లిళ్లకే కాకుండా నిశ్చితార్థం, ఇతర శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆయా నెలల్లోని పెళ్లి ముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి: 16, 17, 18, 21, 22 తేదీలు.
ఫిబ్రవరి: 7, 13, 14, 18, 20, 21, 25.
మార్చి: 5, 6.
ఏప్రిల్: 14, 16, 18, 19, 20, 25, 29, 30.
మే: 5, 6, 7, 8, 17, 28.
జూన్: 1, 2, 4, 7, 8.
నవంబర్: 22, 23, 25, 30.
డిసెంబర్: 4, 11 తేదీలు పెళ్లికి అనుకూలం.
పెళ్లికి ముహూర్తాలు లేని నెలలు
2025లో కొన్ని నెలల్లో పెళ్లి ముహూర్తాలు లేవు. దీనికి కారణం కొన్ని ప్రత్యేక సమయాల్లో గ్రహాల స్థానాలు శుభకార్యాలకు అనుకూలంగా ఉండకపోవడమే. జులై నుంచి అక్టోబర్ వరకు దేవశయనం ఉంటుంది. ఈ సమయంలో దేవతలు నిద్రిస్తారని నమ్ముతారు. కాబట్టి ఈ నాలుగు నెలలు పెళ్లిళ్లకు అనుకూలం కాదు. ఆ తర్వాత మార్చి నుంచి ఏప్రిల్ వరకు మలమాసం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు మీన రాశిలో సంచరిస్తాడు. ఇది కూడా శుభకార్యాలకు మంచి సమయం కాదు. అలాగే 2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 14 వరకు ఖర్మాసం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటాడు. ఈ కాలాన్ని కూడా పెళ్లిళ్లకు అశుభంగా పరిగణిస్తారు. అంతేకాదు మార్చి 7 నుంచి మార్చి 15 వరకు హోలాష్టక్ కాలం కూడా అశుభం.
ముహూర్తాలు లేని నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకునేవారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అబుజ ముహూర్తాలు (Abujh Muhurats) అనే ప్రత్యేక రోజులు ఉన్నాయి. వీటిని విశ్వవ్యాప్తంగా శుభప్రదమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో జాతక పరిశీలన అవసరం లేకుండానే పెళ్లి చేసుకోవచ్చు.
ఏప్రిల్‌లో ఎక్కువ ముహూర్తాలు
ఏప్రిల్‌లో ఎనిమిది శుభ ముహూర్తాలు ఉన్నాయి. కానీ డిసెంబర్‌లో కేవలం రెండు ముహూర్తాలే ఉన్నాయి. కాబట్టి నచ్చిన తేదీలో పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మంచి ముహూర్తాల్లో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ వంటివి త్వరగా బుక్ అయిపోతాయి. పెళ్లి పనుల విషయంలో ఆలస్యం చేస్తే, ఇబ్బందులు తలెత్తవచ్చు.
0 Response to "Wedding Dates: 2025"
Post a Comment