DA Hike
DA Hike: ఏపీ ఉద్యోగులకు పండగే.. భారీగా జీతాలు పెంచనున్న ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ ఎన్జీవో నేతలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తమ సంఘం ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ముఖ్యంగా పెండింగ్ డీఏ, పీఆర్సీ కమిషన్ నియామకం, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎంను కోరినట్లు పేర్కొన్నారు.
విజయవాడ గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ, "ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే శుభవార్త వింటారు" అని అన్నారు.
డీఏ, పీఆర్సీ బకాయిల విడుదల. ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలపై దృష్టి. వెలగపూడి సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరించాలన్నారు.
ఉద్యోగులకు నగదురహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు ప్రతీ అంశంపై సానుకూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నేతలు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి.
0 Response to "DA Hike"
Post a Comment