EPFO Good News for Pensioners.. Now Pension from Anywhere
పెన్షన్‌దారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్.. ఇకపై ఎక్కడి నుంచైనా పెన్షన్
ఈపీఎస్ పింఛన్‌దారుల (EPS Pensioners)కు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ (Pensions from any Bank) తీసుకునేందుకు వీలు కల్పించింది.
ఇందుకోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను (CPPS) దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనివల్ల 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనకరమని పేర్కొంది.
ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉంది. దీని వల్ల ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీంతో పింఛను (Pension) ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం తప్పింది. అంతేకాదు పింఛన్ (Pension) విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది.
సెంట్రలైజ్డ్ వ్యవస్థ వల్ల పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతానికి మారినా ఇబ్బంది ఉండదు. ఒక ఆఫీసు నుంచి ఇంకో ఆఫీసుకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను బదిలీ చేయాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ తెలిపింది. ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచైనా పింఛన్ పొందే వీలుంటుందని తెలిపింది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత సొంత ప్రాంతాలకు తరలివెళ్లే వారికి సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. తొలుత అక్టోబర్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. నవంబర్‌లో రెండో దశ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
0 Response to "EPFO Good News for Pensioners.. Now Pension from Anywhere"
Post a Comment