Do you want Sainik school admission for your kids..? But apply immediately, tomorrow is the last date
మీ పిల్లలకు సైనిక్ స్కూల్ అడ్మిషన్ కావాలా..? అయితే వెంటనే అప్లై చేయండి, రేపే లాస్ట్ డేట్.
2025-26 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్లో మీ పిల్లలను జాయిన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం... రేపటిలోగా దరఖాస్తు చేయించండి.
Sainik School Entrance 2025 : మీ పిల్లలను భారత సైన్యంలో చేర్చాలన్నది మీ కోరికా? అయితే వెంటనే మీ పిల్లలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ స్కూల్లో చేర్చండి. 2025-26 అకడమిక్ ఇయర్ కు గాను ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ఆలిండియా సైనిక్స్ స్కూల్స్ ఎంట్రన్ ఎగ్జామ్ (AIS 2025) కోసం NTA (నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సైనిక్ స్కూల్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఒక రెసిడెన్షియల్ పాఠశాల. ఇది ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కాన్ఫరెన్స్ యొక్క పాఠ్యాంశాలను అనుసరిస్తుంది. ఈ స్కూళ్లలోో బాలురు మాత్రమే అనుమతించబడతారు. దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లలో 6 మరియు 9 తరగతులలో ప్రవేశానికి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.
2025-26 విద్యా సంవత్సరానికి 6 మరియు 9 తరగతులలో ప్రవేశానికి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరిలో జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 24 నుండి ప్రారంభమయ్యాయి.
పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ రేపు (జనవరి 23, గురువారం). ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే https://exams.nta.ac.in/AIS/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.650 మరియు ఇతరులకు రూ.800, జనవరి 24 నాటికి ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
అర్హతలు :
సైనిక్ స్కూల్స్ ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఐదో తరగతి పాసయి మార్చి 31, 2025 నాటికి 10 నుండి 12 ఏళ్లలోపు వుండాలి. తొమ్మిదో తరగతి ప్రవేశానికి అయితే ఎనిమిదో తరగతి పాసయి 13 నుండి 15 ఏళ్లలోపు వయసుండాలి.
పరీక్ష విధానం
ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.40 గంటల వరకు పరీక్ష వుంటుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష వుంటుంది.
ఆరో తరగతి ప్రవేశానికి 125 ప్రశ్నలకు 300 మార్కులు వుంటాయి. లాంగ్వేజెస్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథ్స్ లో 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు వుంటాయి.
ఇక తొమ్మితో తరగతి ప్రవేశానికి 150 ప్రశ్నలకు 400 మార్కులు వుంటాయి. ఇందులో మ్యాథ్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు వుంటాయి.
దరఖాస్తు విధానాలు, అర్హత ప్రమాణాలు, హాల్ టికెట్ విడుదల మరియు ఇతర వివరాల కోసం NTA వెబ్‌సైట్ (www.nta.ac.in)ని సందర్శించండి. ఏవైనా ప్రశ్నల కోసం, 011-40759000కి కాల్ చేయండి లేదా aissee@nta.ac.inకి ఇమెయిల్ చేయండి.
0 Response to " Do you want Sainik school admission for your kids..? But apply immediately, tomorrow is the last date"
Post a Comment