Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you apply this, dark circles will disappear within a week.

 ఇది పెడితే. వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ కనిపించకుండా పోతాయి.

If you apply this, dark circles will disappear within a week.

కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాల వల్ల అందం పాడవుతుంది. నిజానికి ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు గనుక ఒకటి పెడితే వారం రోజుల్లోనే ఈ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.

ముఖం అందంగా కనిపించాలంటే మాత్రం ముఖంపై మచ్చలు, మొటిమలు ఉండకూడదు. ముఖ్యంగా మన ముఖ అందానికి కళ్లే ముఖ్యం. కానీ ఈ రోజుల్లో చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల ఎంత అందంగా రెడీ అయినా అలా కనిపించదు. ఏదో పేషెంట్ లా, నీరసంగా కనిపిస్తుంది.

అయితే కళ్ల చుట్టూ ఉన్న నల్ల మచ్చలను తగ్గించుకోవడానికి చాలా మంది ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రకరకాల క్రీములను కొని వాడుతుంటారు. అయినా ఇవి తగ్గనే తగ్గవు. కానీ మీరు రూపాయి ఖర్చు చేయకుండా మీ కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలతో కేవలం వారం రోజుల్లోనే వీటిని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

డార్క్ సర్కిల్స్ ను పోగొట్టే చిట్కాలు

చాలా మంది ఆడవారు తమ ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేయడానికి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. ముఖ్యంగా ఆన్ లైన్ మార్కెట్లలో దొరికే వాటిని బాగా వాడుతుంటారు. కానీ చాలా మటుకు ఇవి వాడటం వల్ల పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉందు. కానీ ఈ ఆధునిక యుగంలో చాలా మంది ఆడవారికి డార్క్ సర్కిల్స్ రావడం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. అందుకే వీటిని చాలా సింపుల్ గా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?

డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కావాల్సిన పదార్థాలు

బంగాళదుంప - ఒకటి

కాఫీ పౌడర్ - ఒకటి

విటమిన్ ఇ క్యాప్సూల్ - ఒకటి

ఎలా తయారుచేయాలంటే?

ముందుగా బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్ని రసాన్ని వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపండి. అంతే మిశ్రమం రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని మీ కళ్ల చుట్టూ అప్లై చేసి 2 నిమిషాలు అప్లై చేసి సున్నితంగా కొంచెం మసాజ్ చేసి వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి

బంగాళాదుంపలు, కాఫీ పౌడర్ ప్రయోజనాలు

ఆలుగడ్డ రసం చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు దీనిలో బ్లీచింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇకపోతే కాఫీ పొడిలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచి, కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్స్ ప్రయోజనాలు

విటమిన్ ఇ క్యాప్సూల్స్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని వివిధ రకాల డ్యామేజ్ ల నుంచి కాపాడుతుంది. అలాగే ముఖంపై ముడతలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ ను మీరు వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించొచ్చు. ఈ క్యాప్సూల్ లోని నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం ఎలాస్టిక్ గా, క్లియర్ గా కనిపిస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. అలాగే ఏదైనా చిట్కాను ప్రయత్నించే ముందు ఖచ్చితంగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే గనుక వీటిని ప్రయత్నించే ముందు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you apply this, dark circles will disappear within a week."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0