Good news insulin no longer needs daily for sugar patients!
HEALTH: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్ ఇన్సులిన్ ఇక పై డైలీ అవసరం లేదు !
ఇన్సులిన్ తీసుకునే వారికే ఆ బాధ తెలుస్తుంది. వారానికోసారి మాత్రమే ఈ "ఎఫ్సిటోరా" అనే కొత్తరకం ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను కనుగొన్నారు.
డయాబెటిక్ పేషెంట్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రక్తంలో షుగర్ లెవల్స అదుపులో పెట్టుకునేందుకు తీసుకునే ఇన్సులిన్ ఇంంజక్షన్స్ ఇక పై వారంలో ఒక్క రోజు తీసుకుంటే చాలు . ఇన్సులిన్ తీసుకునే వారికే ఆ బాధ తెలుస్తుంది. వారానికోసారి మాత్రమే ఈ "ఎఫ్సిటోరా" అనే కొత్తరకం ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను కనుగొన్నారు.
షుగర్ పేషెంట్లు రోజూ తీసుకునే "డెగ్లూడెక్" ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరిగానే ఇది కూడా సురక్షితమని చెబుతున్నారు.
ఇందులో "ఎఫ్సిటోరా" ఫలితాలు మరింత సక్సెస్ ఫుల్‌గా కనిపించినట్టు పరిశోధకులు వెల్లడించారు. అయితే ప్రయోగాలు మొత్తం మూడు సార్లు చేశారు. మూడు సారలు సక్సస్ అవ్వడమే కాకుండా అన్ని టెస్టుల్లోను సక్సస్ అవ్వడం తో దీనిని మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు అన్ని 52 వారాల పాటు ప్రయోగాలు చేశారు.
3 నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ మోతాదులు డెగ్లూడెక్‌తో 8.24% నుంచి 7.05 శాతానికి తగ్గినట్లు కనుగొన్నారు. అదే కొత్త ఇన్సులిన్ ఎఫ్సిటోరాతో 8.21% నుంచి 6.97 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా, డెగ్లూడెక్ తీసుకున్నవారిలో ఆరు సార్లు గ్లూకోజు మోతాదు మరీ తక్కువకు(హైపోగ్లైసీమియా) పడిపోయాయి. ఇన్సులిన్ తీసుకోవడానికి ఇబ్బందిపడేవారికి ఎఫ్సిటోరా మంచి ప్రత్యామ్నాయం కాగలదని సైంటిస్టులు అంటున్నారు
0 Response to "Good news insulin no longer needs daily for sugar patients!"
Post a Comment