Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Walking a day for health? But let's find out these 10 things.

 ఆరోగ్యం కి మంచిది అనుకోని రోజు వాకింగ్ చేస్తున్నారా.? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకుందాం.


మీకు హిపోక్రాట్స్ తెలుసా ? ఆయన ఇప్పటి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన వాడు. అప్పట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు.

ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. సదరు హిపోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఓ కొటేషన్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయన అన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ క్రమంలోనే ప్రతి రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయస్సు మీద పడడం కారణంగా వచ్చే దెమెంతియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

2. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట. నిత్యం వాకింగ్ చేస్తే కళ్లపై అధిక ఒత్తిడి తగ్గడంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట.

3. నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్‌లు రావట. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయట. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట.

4. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి.

5. డయాబెటిస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుందట. 6 నెలల పాటు వాకింగ్‌, రన్నింగ్ చేసిన కొందరు డయాబెటిస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. వాకింగ్ చేసిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రోజూ వాకింగ్ చేస్తే డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు.

6. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం పోతుంది. విరేచనం రోజూ సాఫీగా అవుతుంది.

7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయట.

8. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా అరిగిపోవు. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.

9. బ్యాక్ పెయిన్‌తో సతమతమయ్యేవారికి వాకింగ్ చక్కని ఔషధం అనే చెప్పవచ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది. కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది. కనుక వెన్ను నొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయడం మంచిది.

10. నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక నిత్యం వాకింగ్ చేయడం మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Walking a day for health? But let's find out these 10 things."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0