In the first year of the public exams in the first year
ఇంటర్ మొదటి ఏడాదిలో పబ్లిక్ పరీక్షలు యథాతథం
అందరి సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం నిర్ణయం
ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిల బస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటిం చింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలు నిర్వహిం చకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, అభ్యసన సామర్ధ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్ సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహి స్తారు. గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండిం టిని కలిపి ఒకే పేపర్ గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్ప నిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యా ర్ధులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమా వేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు.
0 Response to "In the first year of the public exams in the first year"
Post a Comment