Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap WhatsApp Governance

 Ap WhatsApp Governance: వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలు మీకు కావాల్సిన అన్ని సేవలు, సర్టిఫికెట్స్ వస్తాయి.

Ap WhatsApp Governance

Ap WhatsApp Governance :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వాట్సాప్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. జస్ట్ మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు.. మీకు కావాల్సిన ప్రతి సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులకు మరియు డాక్యుమెంట్స్ కి ఉపయోగించుకోవచ్చు.  ఎలా ఏంటి చూద్దాం మీకు ఏమనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Ap WhatsApp Governance Overview

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మన మిత్ర-ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో..వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ప్రారంభించిన ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా 161 సేవలు అందించనున్న ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకుండా అందనున్న ప్రభుత్వ సేవలు

  • 2024 అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
  • 36 శాఖలను ఇంటిగ్రేట్ చేయాలి.
  • ప్రస్తుతం అందుబాటులోకి 161 సేవలు
  • రెండో విడతలో 360 సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • ప్రతి సర్టిఫికెట్‌పై QR కోడ్ ఉంటుంది.
  • టీటీడీని కూడా ఈ సేవల పరిధిలోకి తీసుకొస్తాం.
  • అన్ని పౌరసేవలకు పరిష్కార కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
  • సులభతరంగా డిజిటల్‌ సేవలు అందించడమే లక్ష్యం

 వాట్సప్ గవర్నెన్స్ ఇప్పుడు నుంచి పని చేస్తుంది? ఎన్ని సర్వీస్ లో అందుబాటులో ఉన్నాయి?

వాట్సప్ గవర్నెన్స్ ఇప్పుడు నుంచి పని చేస్తుంది? ఎన్ని సర్వీస్ లో అందుబాటులో ఉన్నాయి?

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ( 30-01-2025 ) వాట్సప్ గవర్నెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి.
  •  దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందించనుంది.
  •  మొదటి విడతలో 161 సేవల్ని వాట్సప్ ద్వారా అందించనుంది.
  • ఇవాళ ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద వాట్సప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
  • తొలివిడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు వాట్సప్‌లో అందుతాయి.
  •  సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
  •  పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశాలు.
  •  వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
  •  వేగంగా పౌరసేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
  • సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని నిర్ణయం తీసుకుంది.
  •  రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 
  •  మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించింది.
  •  ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. 
  •  రెండో విడతలో మరిన్ని పౌరసేవల్ని అందించాలని నిర్ణయించింది.
  • ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సప్ నంబరుకు మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.
  •  రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్ లో పంపిస్తారు.
  •  అందులో నుంచి మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకొనే అవకాశం
  • విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించొచ్చు.
  •  ట్రేడ్ లైసెన్సులు పొందొచ్చు.
  •  దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. 
  •  రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు.

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. వినతులు, ఫిర్యాదులు ఎలా ఇవ్వాలి?

వాట్సాప్ నంబర్ 95523 00009 కి మెసేజ్‌ పంపితే, వెంటనే లింక్ వస్తుంది.

అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలు నమోదు చేసి, మీ వినతిని టైప్‌ చేయాలి.

 దీనికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.

ఈ నంబర్ ఆధారంగా మీ ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.

Ap WhatsApp Governance ద్వారా పొందే ధ్రువపత్రాలు?

 OBC, EWS, ఆదాయ సర్టిఫికేట్, నో ఎర్నింగ్ సర్టిఫికేట్

 సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) దరఖాస్తుల స్టేటస్

 విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు

 ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ శాఖ ధ్రువపత్రాలు

 ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్‌బ్యాక్ సేవలు

ముగింపు :: రాష్ట్ర ప్రభుత్వం సేవలు తీసుకువచ్చిన ఈ Ap WhatsApp Governance పై మీ అభిప్రాయం ఏంటి.. తప్పకుండా మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి మీ అభిప్రాయం తెలపండి.. ఈ సర్వీసులు ప్రజలకు ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి.. తప్పకుండా మీ అభిప్రాయం మాకు వాట్సాప్ లో తెలపండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap WhatsApp Governance"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0