Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Secret Cameras

 Secret Cameras: సీక్రెట్‌ కెమెరాలు ఉన్నాయని అనుమానమా? స్మార్ట్‌ఫోన్‭తో ఇట్టే కనిపెట్టేయండి!

మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్‌ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్‌ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే.

హోటల్‌ రూమ్‌ లేదా ఏదైనా ప్రవేట్ రూమ్స్ లోకి అడుగు పెట్టినప్పుడు, స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్‌ ఉపయోగించి సీక్రెట్‌ కెమెరాలను గుర్తించవచ్చు. ఇందుకోసం గదిలోని అన్ని లైట్లు ఆఫ్‌ చేసి, ఫోన్‌ ఫ్లాష్‌ను ఆన్‌ చేయండి. రూమ్‌లోని లైటింగ్‌ లేదా ప్రతిబింబించే లెన్స్‌ను గుర్తించి సీక్రెట్‌ కెమెరాలను వెతకండి. ప్రత్యేకంగా గడియారాలు, అద్దాలు, స్మోక్‌ డిటెక్టర్లు, ఇంకా USB ఛార్జింగ్‌ పోర్టులు వంటి ప్రాంతాల్లో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్‌ లైట్స్‌ను గుర్తించడంలో సహాయపడతాయి. మన కళ్లకు ఈ లైట్‌లు కనిపించకపోయినా, ఫోన్‌ కెమెరాలు వాటిని గుర్తించగలవు. లైట్లు ఆఫ్‌ చేసిన తరువాత రూమ్‌లో ఉన్న ప్రతి ప్రదేశాన్ని కెమెరా ద్వారా తనిఖీ చేయండి. అలా వెతుకుతున్న సమయంలో ఏదైనా చుక్కలు లేదా మెరుస్తున్న లైట్‌లను చూసినప్పుడు అది సీక్రెట్‌ కెమెరా కావచ్చని గ్రహించండి.

స్పై కెమెరాలు సాధారణంగా డేటాను ఇతర పరికరాలకు బదిలీ చేయడానికి వైఫై లేదా బ్లూటూత్‌ కనెక్షన్లను ఉపయోగిస్తాయి. కాబట్టి, మీరు ఉపయోగిస్తున్న వైఫై నెట్‌వర్క్‌లో అనుమానాస్పదమైన “Camera” వంటి పేర్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. వాటిని సంబంధిత వ్యక్తులకు నివేదించండి. ఇకపోతే, సీక్రెట్‌ కెమెరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, iOS స్టోర్లలో ఈ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు హోటల్‌ లేదా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఈ యాప్‌లను ఉపయోగించి కెమెరాలను గుర్తించవచ్చు. మొత్తానికి ఇలాంటివి ఉన్నాయని ఏదైనా అనుమానం ఉంటే, వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు ఆందోళన లేకుండా సురక్షితంగా ఉండవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Secret Cameras"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0