Let us learn about this little hole that appears on every smart phone.
ప్రతీ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి తెలుసుకుందాం.
ఈకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు.
కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్ పై వైపు ఉన్న ఫ్రేమ్ లో, కింద చార్జింగ్ ఫోర్ట్ పక్కన ఉన్న చిన్నపాటి రంధ్రం ఉండటం మీరు గమనించి ఉంటారు.
మరి ఆ రంద్రం ఎందుకు ఉంది అన్నది అనేది చాలామందికి కూడా తెలియదు. మరి ఇక ఆ రంద్రం ఎందుకు ఉంది? దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దం అనేది వినిపిస్తుందని, అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాట స్పష్టంగా వినిపించడం లేదు అని చాలామంది కూడా చెప్పేవారట.
అదే ఇక నాయిస్ డిస్టబెన్స్. ఆ తర్వాత విడుదలైన స్మార్ట్ ఫోన్లలో మొదట్లో వచ్చిన ఆ సమస్య అనేది మళ్లీ రాలేదు. ఇక మళ్ళీ ఆ సమస్య రాకపోవడానికి గల కారణం ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ చిన్న రంధ్రమే. ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్ అనేది ఉంటుంది. అది నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్ గా కూడా పనిచేస్తుంది. దానివల్ల ఫోన్ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం అనేది లేకుండా ఒకరి మాటలు మరొకరికి స్పష్టంగా వినిపిస్తాయి. చాలామంది కూడా ఫోన్ లోపలికి ఎయిర్ కోసం ఏర్పాటు చేశారని కూడా భావిస్తుంటారు. అయితే అది ఎయిర్ కోసం ఏర్పాటు చేసింది కాదు.
0 Response to "Let us learn about this little hole that appears on every smart phone."
Post a Comment