Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Want a lower berth in a train? By doing this, the booking will be confirmed.

 రైలులో లోయర్ బెర్త్ కావాలా? ఇలా చేస్తే కన్ఫర్మ్‌గా బుక్ అవుతుంది.

ట్రైన్ లో ప్రయాణించాలంటే వృద్ధులు, మహిళలు ఎక్కువగా లోయర్ బెర్త్ ప్రిఫర్ చేస్తారు. అయితే లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. అసలు టికెట్ రిజర్వ్ చేయడమే ఒక పెద్ద యుద్ధం లాంటిది.

మరి లోయర్ బెర్త్ కావాలంటే భారతీయ రైల్వే శాఖ ఓ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. అదేంటో తెలుసుకుందాం రండి.

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రతి ప్రయాణికుడి అవసరాలను తీర్చడానికి రైల్వే తన వంతు కృషి చేస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు రైలులో ప్రయాణించే అన్ని వర్గాల వారికి అవసరమైన సౌకర్యాలు అందిస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు రైల్వే ప్రత్యేక రాయితీలు కల్పిస్తుంది. అయితే మీ కుటుంబంలోని వృద్ధులకు ఎప్పుడు రైలు టికెట్ బుక్ చేసినా లోయర్ బెర్త్ రావడం లేదా? ఇలా చేస్తే కచ్చితంగా లోయర్ బెర్త్ లభిస్తుంది.

వృద్ధుల సౌకర్యం కోసం రైల్వే అనేక నియమాలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. వీటిని ఉపయోగించుకొని వృద్ధులు ప్రత్యేకంగా లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. వృద్ధులకు లోయర్ బెర్త్ సులభంగా కేటాయించడం గురించి IRCTC వివరాలు వెల్లడించింది. ఎందుకంటే ఇటీవల ఓ వ్యక్తి X(ట్విటర్)లో IRCTCకి ఓ ట్వీట్ చేశాడు. తన మామకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లలో సమస్య ఉండటంతో లోయర్ బెర్త్ కోసం ప్రాధాన్యత ఇచ్చానని, అయినప్పటికీ రైల్వే అతనికి అప్పర్ బెర్త్ ఇచ్చిందని అతను ట్వీట్ చేశారు.

దీనికి సమాధానంగా రైల్వే శాఖ నుంచి రిప్లై వచ్చింది. జనరల్ కోటాలో టికెట్ బుక్ చేస్తే లోయర్ బెర్త్ ఉంటేనే కేటాయింపు జరుగుతుందని, సీట్లు లేకపోతే దొరకవని రైల్వే శాఖ తెలిపింది. అయితే 'Lower Berth Quota' విభాగంలోకి వెళ్లి రిజర్వేషన్ చేస్తే లోయర్ బెర్త్ దొరుకుతుందని పేర్కొంది.

జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ కావాలని ప్రిఫర్ చేసిన వృద్ధులు, మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని రైల్వే శాఖ తెలిపింది. అయితే సీట్లు ఖాళీగా ఉంటేనే కేటాయించగలమని, అదే 'Lower Berth Quota' విభాగంలోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకునే వారికి సీట్లు కేటాయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ సీట్లు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన లభిస్తాయని వివరించింది.

జనరల్ కోటాలో సీట్ల కేటాయింపులో మానవ జోక్యం ఉండదని రైల్వే శాఖ పేర్కొంది. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం TTEని కూడా సంప్రదించవచ్చని తెలిపింది. లోయర్ బెర్త్ అడిగిన వ్యక్తి వయసు, ఇతర పరిస్థితులను గమనించి TTEని లోయర్ బెర్త్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. వికలాంగులు, గర్భిణులకు లోయర్ బెర్త్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Want a lower berth in a train? By doing this, the booking will be confirmed."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0