Union Bank of India Apprenticeship Recruitment 2025
డిగ్రీ అర్హతతో 2,691 బ్యాంక్ జాబ్స్.. ఫ్రీ ట్రైనింగ్.
డిగ్రీ పాసై ఉన్నారా..? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంకులో 2,691 పోసుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. అప్లై చేయండి.
మొత్తం : 2,691 అప్రెంటీస్ పోస్టులు
అప్లికేషన్ ప్రారంభం : 19. 02.2025
అప్లికేషన్ చివరి తేదీ: 05.03.2025
అర్హత : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : ఫిబ్రవరి 1,2025 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. నాలెడ్జ్ టెస్టు, లోకల్ లాంగ్వేజ్ టెస్టు ఉంటుంది. వెయిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది జాబితా ఉంటుంది.
పరీక్ష విధానం : పరీక్షలో జనరల్, ఫైనాన్సిషల్ సబ్జెక్టు, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్,రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 800/- ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600/- ఉంటుంది. దివ్యాంగులకు రూ. 400/- ఉంటుంది.
0 Response to "Union Bank of India Apprenticeship Recruitment 2025"
Post a Comment