PM Internship: Scheme of providing 5 thousand per month along with training for students.
PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం.
PM Internship: విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకి 5 వేలు అందించే పథకం
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్యార్థులకు అండదండగా నిలవడానికి కొత్త కొత్త పథకాలు తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి పథకాలలో భాగంగా ఈ PM Internship పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇదివరకే పథకానికి సంబంధించి చాలామంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మళ్లీ పథకానికి సంబంధించి కేంద్రం అప్డేట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెలవారీగా రూ. 5,000 వేలు పీఎం ఇంటర్న్ షిప్ ను అందిస్తారు.
అర్హతలు
21 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్థులు ఈ PM Internship కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 వేల చొప్పున అందించనున్నారు. ఒక్కసారి రూ. 6,000 రూపాయలు కూడా అందించనున్నారు.
మొత్తం సంవత్సరంలో 6 నెలలపాటు ఉద్యోగ శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.
వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.
మీకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా క్రింద ఇవ్వబడిన నెంబర్ ని కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చును.
టోల్ ఫ్రీ నెంబర్ :- 1800 11 6090
0 Response to "PM Internship: Scheme of providing 5 thousand per month along with training for students."
Post a Comment