Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammo One Tarikhu: Rules from March .. Alert for the common man.

 ఆమ్మో ఒకటో తారిఖు: మార్చ్ నుండి మారనున్న రూల్స్.. సామాన్యుడికి అలర్ట్.
Ammo One Tarikhu: Rules from March .. Alert for the common man.
ఫీబ్రవరి నెల ముగిసి  మార్చ్ ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే మార్చి నెల కూడా కొన్ని పెద్ద మార్పులతో స్టార్ట్ కానుంది. వీటిలో ఎల్‌పిజి సిలిండర్ల ధరల నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ పద్ధతుల వరకు ప్రతిదానిలోనూ మార్పు రాబోతోంది.
దీనితో పాటు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నామినీకి సంబంధించిన నియమంలో కూడా మార్పు రాబోతుంది. మార్చ్ 1వ తేదీ నుండి అమలు కానున్న కొన్ని మార్పుల గురించి తెలుసుకోండి...
LPG సిలిండర్ ధరలలో మార్పు
మార్చి 1వ తేదీ నుండి LPG గ్యాస్ సిలిండర్ల ధరలో సవరణలు ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున కొత్త ధరలను విడుదల చేస్తాయి. అంతకుముందు ఫిబ్రవరి 1న బడ్జెట్ (budget 2025)లో ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.7 తగ్గించాయి. అయితే 14 కిలోల వంటింటి గ్యాస్ సిలిండర్ల ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో వచ్చే నెల నుండి వంట గ్యాస్ ధరల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది. 
ATF ధరలో సవరణ 
LPG సిలిండర్ల ధరలతో పాటు, ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలను కూడా ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రతి నెల మొదటి తేదీన సవరిస్తాయి. వచ్చే మార్చ్ 1 నుండి విమాన ఇంధన ధరలలో మార్పులను చూడవచ్చు. దీనిలో మార్పు వల్ల ప్రత్యక్ష ప్రభావం విమాన ప్రయాణీకుల జేబులపై చూపుతుంది. వాస్తవానికి, ఇంధన ధరలు తగ్గినప్పుడు విమానయాన సంస్థలు ఫ్లయిట్ టికెట్ ఛార్జీలను తగ్గించవచ్చు అలాగే ధరలు పెరిగితే టికెట్ చార్జెస్ పెంచవచ్చు.
UPI కి సంబంధించిన మార్పు 
1 మార్చి 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)లో మార్పు రానుంది, దీని వల్ల బీమా ప్రీమియం పేమెంట్ మరింత ఈజీ చేస్తుంది. UPI వ్యవస్థకు ఇన్సూరెన్స్-ASB (అప్లికేషన్ సపోర్ట్డ్ బై బ్లాక్ అమౌంట్) అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ప్రీమియం పేమెంట్ కోసం ముందుగానే డబ్బు ప్రిసెట్ చేసుకోవచ్చు. పాలసీదారులు ఒకే చేసిన తర్వాత, డబ్బు ఆటోమేటిక్'గా అకౌంట్ నుండి కట్ అవుతుంది. దీనికి సంబంధించి, IRDAI ఫిబ్రవరి 18న ఒక సర్క్యులర్ జారీ చేసింది.
మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నామినీలు. 
మార్చ్ 1 తేదీ నుండి మ్యూచువల్ ఫండ్ అండ్ డీమ్యాట్ అకౌంట్లో నామినీలను జత చేయడానికి సంబంధించిన నియమాలలో మార్పు ఉండవచ్చు. దీని కింద ఒక పెట్టుబడిదారుడు డీమ్యాట్ లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో గరిష్టంగా 10 మంది నామినీలను పెట్టుకోవచ్చు. ఈ విషయంలో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ SEBI కొత్త మార్గదర్శకాలు 1 మార్చి 2025 నుండి అమలులోకి రావచ్చు.
బ్యాంకులు 14 రోజులు బంద్ . 
వచ్చే నెలలో అంటే మార్చిలో మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే RBI బ్యాంక్ సెలవుల లిస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లండి. RBI బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం ఈ నెలలో 14 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి, ఇందులో హోలీ (హోలీ 2025) మరియు ఈద్-ఉల్-ఫితర్ సహా ఇతర పండుగలు కూడా ఉన్నాయి. వీటిలో రెండవ, నాల్గవ శనివారాలు సహా ఆదివారలు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammo One Tarikhu: Rules from March .. Alert for the common man."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0