You have to see hell here .. Go to yourself: America Warning.
ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్.
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకీ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే వేలాదిమంది అక్రమ వలసదారులను గుర్తించి ఆర్మీ ప్రత్యేక విమానాల ద్వారా వారివారి స్వస్థలాలకు పంపుతోంది.
ఈ క్రమంలోనే.. అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమవలసదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ద్వారా వార్నింగ్ ఇస్తూ టీవీల్లో యాడ్స్ ఇస్తోంది. డీహెచ్‌ఎస్ అధికారుల వార్నింగ్ సందేశాన్ని రేడియోలు, టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విరివిగా ప్రసారం చేస్తోంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నవారిని చేరుకునేలా సోషల్ మీడియాతోపాటు టెక్ట్స్ మెసెజ్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చారు అమెరికా అధికారులు.. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని వీడియోలో పేర్కొన్నారు.
అక్రమ వలసదారులు ఎవరికివారు తామంతట తాముగా అమెరికా అధికారులను సంప్రదిస్తే.. స్వస్థలాలకు పంపేందుకు సురక్షితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాకాకుండా తమ సెక్యూరిటీ బృందాలు పట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్యూరిటీ అధికారులకు పట్టుబడ్డ అక్రమవలసదారులను అమెరికా బహిష్కరిస్తుందని, ఎప్పటికీ అమెరికా రాలేరని తెలిపారు. కానీ.. ఇప్పుడు వెళ్లిపోతే ఎప్పుడైనా అమెరికా వచ్చేందుకు, చట్టబద్ధంగా వచ్చి అమెరికాలో జీవించేందుకు అవకాశాలు ఉంటాయని వీడియో సందేశం ద్వారా ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు.. అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించడం ద్వారా నేరస్తులైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని, జరిమానాలు, జైలు శిక్షలు తప్పని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి తమ చట్టాలను ఉల్లంఘించేవారిని ఖచ్చితంగా వేటాడుతామని.. నేరస్థులకు అమెరికాలో స్థానం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఎవరైనా అధికారుల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు.
0 Response to "You have to see hell here .. Go to yourself: America Warning."
Post a Comment