Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 🔔 *శివోహం* 🔔


ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?


*పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా…………?*


శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.

సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.


పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు

(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).


వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు” అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.


శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.

ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.


శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.

లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.


శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.

బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా ఉంటుంది.


*శివ లింగములు – రకములు*


• స్వయం భూ లింగములు: స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.


• దైవిక లింగములు: దేవతా ప్రతిష్టితాలు.


• రుష్య లింగములు: ఋషి ప్రతిష్టితాలు.


• మానుష లింగములు: ఇవి మానవ నిర్మిత లింగములు.


• బాణ లింగములు: ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరిక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు (pebbles).


*పంచభూతలింగాలు*


పంచభూతాలు అనగా పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు

ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.


• 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై


• 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం


• 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం


• 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి


• 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి


*పంచారామాలు*


• 1. అమారారామము:

అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవిh


• 2. ద్రాక్షారామము:

ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ


• 3. కుమారారామము:

సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి


• 4 భీమారామము:

భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ


• 5. క్షీరారామము:

పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.


కొన్ని విశేషాలు:


• శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.

కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.


• కంచిలోని శివలింగం మట్టితో చేసినది(పృధ్వీ లింగం).

కాబట్టి లింగానికి అభిషేకము జరగదు. నూనెను మాత్రం పూస్తారు.


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0