*🙏శ్రీ వేద సన్నిధి🙏*
*మహా శివరాత్రి పర్వదిన విశిష్టత*
మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం.
_💐శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి తెలుసుకుందాము💐_
ఈ లింగోద్భవ కాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు.
వారికున్న ఈతి బాధలు తొలగి పోతాయి అని శాస్త్ర వచనం.
శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, శివలింగాన్ని పూజించాలి.
జాగరణ చేసి, లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు.
శివరాత్రి నాడు శివలింగానికి రోజంతా పూజించవచ్చు, సూర్యోదయము నుంచి మళ్లీ సూర్యోదయము వరకు ఎప్పుడైనా పూజించవచ్చు.
కాని అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈశ్వరుడిని పంచామృతాలతో, జలధారలతో అభిషేకించండి. సర్వశుభాలు కలుగుతాయి.
శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి.
ఆచమనము చేసి, విభూతి తప్పక పూసుకోవాలి, రుద్రాక్షలు ధరిస్తే మంచిది.
ఆ తరువాత గణపతిని పూజించాలి, పగలు, రాత్రి కూడా షోడషోపచారాలతో పూజించాలి.
నమకచమకాలతో లేదా మహన్న్యాసం పెట్టుకుని, రుద్రాధ్యాయము వింటూ అభిషేకించండి.
జలంతోపాటు, పంచామృతాలతో, పాలతో, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థముగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.
దారిద్ర్యము తొలగిపోతుంది, అకాలమరణం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది,
ఫలరసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి.
పసుపుకుంకుమలజలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది, గంగాజలం మరీ మంచిది.
అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించడం మంచిది, శివుడిని పసుపు పచ్చని పూలతో, తెల్లని పూలతో పూజించడం మంచిది,
శివ మానస స్తోత్రం చేయాలి, *ఓం నమఃశివాయ* అనే పంచాక్షరీ మంత్రంతో అర్చన చేయడం మంచిది...
ధూపము, దీప, నైవేద్యం ఉండి తీరాలి.
పంచ ఉపచారములు చేయాలి, లింగోద్భవ కథను చెప్పుకోవాలి.
అర్థరాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి, 12గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి.
ఈ రోజు ఉపవాసం ఉండి పళ్ళు, పాలు తీసుకోవచ్చును, మరునాడు స్నానం చేసి దానము చేయాలి.
వ్రతము చేసిన వాళ్ళు పండితులకు, ఇంటి పురోహితులకు స్వయంపాకం, పేదలకు ఆన్నదానం చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు.
శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మంచిది..
*నూతక్కి శివకృష్ణమాచార్యులు*
వాస్తు జ్యోతిష్య పురోహితులు
0 Response to " "
Post a Comment