Colors do not want .. This oil is guaranteed to turn your white hair black.
White Hair: కలర్స్ అక్కర్లేదు.. ఈ ఆయిల్ రాశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారెంటీ.
White hair Home remedies in telugu:కలర్స్ అక్కర్లేదు.. ఈ ఆయిల్ రాశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారెంటీ.. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
కాస్త ఓపికగా చేసుకోవాలి.
ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అలా తెల్లజుట్టు వచ్చినప్పుడు ప్రారంభంలోనే కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె,ఒక కప్పు గుంటకలగర ఆకు రసం,నాలుగు ఎర్ర మందార పువ్వలు వేసి బాగా మరిగించాలి. నీరు అంతా ఇగిరిపోయి నూనె తేలేవరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి జుట్టుకి రాయాలి. ఈ నూనెను ప్రతి రోజు రాసుకొని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అంతేకాకుండా జుట్టు రాలకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజుల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అదే తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువ ఉన్నవారు కాస్త ఓపికగా ఈ రెమిడీని ఫాలో అవ్వాలి.
రసాయనాలు ఉన్న హెయిర్ డ్రై లు కన్నా సహజసిద్ధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కా బెటర్ కదా. కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలా సమర్ధవంతంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
0 Response to "Colors do not want .. This oil is guaranteed to turn your white hair black."
Post a Comment