Second Sim Tension No No .. Rs 59K Recharge .. SIM is active all day.
సెకండ్ సిమ్ టెన్షన్ ఇక వద్దు.. రూ.59కే రీఛార్జ్.. సిమ్ ఏకంగా అన్ని రోజులు యాక్టివ్.
భారతదేశంలోని టాప్ టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi), BSNL ఇటీవలి నెలల్లో తమ రీఛార్జ్ ప్లాన్లను అప్‌డేట్ చేశాయి.
ఈ మార్పుల్లో చాలా వరకు సిమ్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడం మరింత సరసమైనదిగా మారింది, ముఖ్యంగా తక్కువ ధరకే సెకండ్ నంబర్‌ను మెయింటెయిన్ చేయాలనుకునే యూజర్లకు ఇవి వరంలా మారాయి. ఒక ప్లాన్ కేవలం రూ.59కే సెకండ్ సేమ్ యాక్టివ్‌గా ఉంచుతుంది.
BSNL మినిమమ్ రీఛార్జ్ ప్లాన్స్ రూ.59, రూ.99
BSNL అన్ని టెలికాం ప్రొవైడర్లలోకెల్లా చవకైన ప్లాన్‌ను అందిస్తోంది. రూ.59 రీఛార్జ్ ప్లాన్ ఏడు రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1GB డేటాను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవారికి BSNL రూ.99 ప్లాన్ ఉంది, ఇది 17 రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో డేటా లేదా SMS ప్రయోజనాలు లేవు.
జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు
జియో యూజర్ల కోసం, సిమ్ యాక్టివ్‌గా ఉండటానికి కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ.189. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMS, 2GB టోటల్ డేటాను అందిస్తుంది. యూజర్లు జియో టీవీ, జియో సినిమా (ప్రీమియం వెర్షన్ కాదు), జియో క్లౌడ్ వంటి జియో యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.
బేసిక్ కనెక్టివిటీతో పాటు కొన్ని మరిన్ని ప్రయోజనాలను కోరుకునే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. ఎయిర్‌టెల్ మినిమమ్ రీఛార్జ్ ప్లాన్ దీనికంటే ఒక పది రూపాయలు ఎక్కువ. అంటే ఎయిర్‌టెల్ యూజర్లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం రూ.199తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 2GB టోటల్ డేటాను అందిస్తుంది. ఇది జియో రూ.189 ప్లాన్ కంటే కొంచెం ఖరీదైనది అయినా, ఇది రోజుకు ఎక్కువ SMS పరిమితిని అందిస్తుంది, ఇది కొంతమంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా (Vi) మినిమమ్ రీఛార్జ్ ప్లాన్స్
Vi వివిధ ప్రాంతాలను బట్టి వేర్వేరు మినిమమ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. కొన్ని ప్రాంతాలలో, చవకైన ప్లాన్ రూ.99, ఇది 15 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 టాక్ టైమ్, 500MB డేటా, స్టాండర్డ్ రేట్లకు పోర్ట్-అవుట్ SMS పంపే ఆప్షన్‌ను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో ఉచిత SMS లేదా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉండవు.
రూ.155 ప్లాన్, కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంది, ఇది 20 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 1GB టోటల్ డేటాను కలిగి ఉంది. ఈ ప్లాన్ రూ.99 ఆప్షన్ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది.
ఏ ప్లాన్ ఉత్తమమైనది
కచ్చితంగా చవకైన ప్లాన్ కావాలంటే, BSNL రూ.59 రీఛార్జ్ ఉత్తమ ఎంపిక, కానీ ఇది ఏడు రోజులు మాత్రమే ఉంటుంది. జియో రూ.189 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ రెండూ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి, కానీ ఎయిర్‌టెల్ రోజుకు ఎక్కువ SMSలను అందిస్తుంది. Vi రూ.99 ప్లాన్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో తక్కువ ధర కలిగిన ఆప్షన్.
కానీ ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ లేదు. చివరికి, ఉత్తమ ప్లాన్ మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది, మీకు తక్కువ ధర కావాలా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలా లేదా SMS, డేటా వంటి మరిన్ని ప్రయోజనాలు కావాలా అనేది మీ ఇష్టం.
0 Response to "Second Sim Tension No No .. Rs 59K Recharge .. SIM is active all day."
Post a Comment