If the Aadhaar card is Rs. 2.5 lakhs. Details of how.
ఆధార్ కార్డు ఉంటే చాలు రూ. 2.5 లక్షలు పొందొచ్చు. ఎలాగో వివరాలు.
వ్యాపారస్తులకు పెట్టుబడి కోసం డబ్బులు అవసరపడతాయి. దీంతో చాలా మంది మైక్రో ఫైనాన్స్ లను ఆశ్రయిస్తారు. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అన్నట్లు మైక్రో ఫైనాన్స్ వాళ్లు ఓ రేంజ్ లో వడ్డీ రూపంలో దోచుకుంటారు.
అయితే అత్యంత తక్కువ వడ్డీతో ఎలాంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకం అందిస్తోంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వ్యాపారస్తులకు డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్లరు. ఎందుకంటే వీరికి ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ ఉండదు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రూపంలో భారీగా దోచుకుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణం పొందొచ్చు.
తక్కువ మొత్తంలో డబ్బులు అవసరమయ్యే వ్యాపారులకు కేంద్రం ఈ పథకాన్ఇన తీసుకొచ్చింది. ఈ పథకం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. తక్కువ వడ్డీ, వేగంగా రుణం పొందొచ్చు.
పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారుల కోసం. చిన్న వ్యాపారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి వెనుకాడతాయి. గ్యారెంటీ, ష్యూరిటీ వంటివి చూపించలేక చిరు వ్యాపారులు లోన్ పొందలేరు. కానీ పీఎం స్వనిధి పథకంలో ఈ సమస్య ఉండదు. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణాలు అందిస్తారు.
కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు అండగా నిలిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది చిరు వ్యాపారులు లబ్ధిపొందారు. రుణాలు తీసుకొని తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు.
కరోనా సమయంలో మోదీ ప్రారంభించిన స్వనిధిలో మొదట 10,000 రూపాయల లోన్ ఇచ్చేవారు. తర్వాత లోన్ మొత్తాన్ని పెంచారు. ఇప్పుడు 2.5 లక్షల వరకు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.
తీసుకున్న రుణాన్ని సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి లోన్ పొందవచ్చు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే రుణ పరిమితిని పెంచుతూ పోతారు.
ఆన్‌లైన్ లేదా CSC కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేటు లోన్ తీసుకునే సమయంలో నిర్ణయిస్తారు. ఆధార్ ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. PM స్వనిధిలో 12 నెలల గడువు ఉంటుంది.
0 Response to "If the Aadhaar card is Rs. 2.5 lakhs. Details of how."
Post a Comment