Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Let's find out about PRC, ir, fitment, da, past pay scale

 PRC, IR, FITMENT, DA, గత పే స్కేల్ లు గురించి వివరాలు తెలుసుకుందాం.

Let's find out about PRC, ir, fitment, da, past pay scale

ఇంటరిమ్ రిలీఫ్ (IR) అంటే ఏమిటి అలాగే ఫిట్మెంట్ అంటే ఏమిటి మరియు ఈ రెండిటి మధ్య తేడాలు:

Revised Pay Scales under PRC-XXX అని మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం RPS-2022 Scales లో ఉన్నాం.

అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రేవైజ్ చేస్తూ ఉంటారు?

వాస్తవానికి మనకు PRC అనేది జీతం పెంచే ఒక ప్రక్రియ గా పరిగణన లోకి తీసుకుంటాం. వాస్తవానికి ఉద్యోగుల జీత భత్యాలు పెంచే ప్రక్రియ కాదు ఇది.

ఒక పోస్టుకు ఒక నిర్దిష్టమైన మొత్తం జీతం గా నిర్ధారించ బడింది. అయితే ద్రవ్యోల్బణం వల్ల, రూపాయి మారక విలువ వల్ల ఆ జీతం విలువ తగ్గుతూ వస్తుంది. (పెరగడం కూడా జరగవచ్చు. కానీ, అలా ఇప్పటివరకు జరగ లేదు). అలా తగ్గిన విలువను సరి చేసి ఉద్యోగి ఆర్థిక స్థాయి నీ స్థిరంగా ఉంచడం కోసం DA రూపంలో సర్దుబాటు చేస్తూ ఉంటారు.  ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతూ ఉన్న కొలది DA శాతం పెరుగుతూ కొన్నాళ్లకు బేసిక్ నీ కూడా దాటి పోతుంది. ఇప్పటికీ మనకి 11 సార్లు ఇతర వేతన సవరణ జరిగింది. ఒకవేళ ఇలా వేతన సవరణ జరగ కుండా  DA లు పెంచుకుంటూ పోతే, ఇప్పుడు మీ బేసిక్ పే 22460 కాకుండా ఐదు రూపాయిలు, లేక పడి రుపాయిలో ఉండేది. DA మాత్రం 5000% లేదా 10000% ఉండేది.

ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్సులు కూడా సహేతుకంగా ఉండవు.

అందువల్ల నియత కాలికంగా ఇలా బేసిక్ పే కు అదనంగా ఇచ్చే DA నీ బేసిక్ లో కలిపేసి కొత్త పే నీ నిర్ధారించి DA ను జీరో చేయడమే వేతన సవరణ.

దానితో పాటు కాలానుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టుల విధుల్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర అలవెన్సులు, మొదలైన సిఫార్సులు చేస్తుంది.

ఇక్కడ fitment అనేది PRC ప్రక్రియలో ఉద్యోగుల జీత భత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్. 1986 ముందు PRC లలో ఈ fitment అనేది మనకు కనపడదు. ఆ PRC లో మొదటిసారి గా 10% fitment NTR  ఇవ్వడం జరిగింది. తదుపరి PRC లలో

1993 PRC లో 10%

1999 PRC లో 25%

2005 PRC లో 16%

2010 PRC లో 39%

2015 PRC లో 43%

2022 PRC లో 23%

Fitment లుగా ఇవ్వడం జరిగింది.

PRC అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ది లో సర్దుబాటు అయ్యేలా IR గా కొంత ఇవ్వటం జరిగేది.

2005 PRC వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి. అందువల్ల IR పై పెద్దగా దృష్టి ఉండేది కాదు.

అలాగే PRC లు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్ కు నోషనల్ గా ఇస్తారు. ఇలా PRC లలో బకాయిలను కోల్పోయిన నెలలు PRC ల వారీగా చూస్తే

1986 లో  - సున్న

1993 లో - 9 నెలలు

1999 లో - 9 నెలలు

2005 లో - 21 నెలలు

2010 లో - 19 నెలలు

2015 లో - 11 నెలలు

2022 లో - 21 నెలలు (మొత్తం 42 నెలలు రాలేదు. అందులో 21 నెలలు రావు. మరో 21 నెలలు ఎప్పుడూ వస్తాయి అనేది తెలియని పరిస్థితి)

అలాగే IR కూడా పొందని పీరియడ్ నీ PRC ల వారీగా చూస్తే.

*1986 - జీరో*

1993 - జీరో

1999 - జీరో

2005 - 20 నెలలు

2010 - 3 నెలలు

2015 - 6 నెలలు

2022 - 12 నెలలు

పే రివిజన్ కమీషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు. ఉద్యోగులు ఈ రోజు పొందుతున్న అనేక సౌకర్యాలు PRC ల సిఫార్సుల అధారంగా వచ్చినవే.

పదోన్నతి పొందిన వారికి FR - 22 B ప్రకారం వేతన స్థిరీకరణ.

Automatic Advancement Scheme.

మొదట 10, 15, 22 ఏళ్లకు ఉండేది.

తరువాత 8, 16, 24 ఏళ్లుగా మార్చారు. (1993 లో)

తరువాత 6, 12, 18, 24 గా మార్చారు. (2010 లో)

ఇటీవల 30 add చేశారు. (2022 లో)

EL నిల్వ

ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తరువాత 240 రోజులకు , ఆ తరువాత 300 రోజులకు పెంచారు.

రిటైర్మెంట్ సమయం లో ఎన్ని ELs ఉంటే అన్నే గరిష్ట పరిమితి కి లోబడి encash చేసుకునే అవకాశం ఉండేది. తరువాత EL నిల్వ 300 కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలన్స్ HPL నుండి encash చేసుకునే అవకాశం కల్పించారు.

మెటర్నిటీ లీవ్ ఒకప్పుడు 90 రోజులే ఉండేవి. తరువాత 120 రోజులకు, 180 రోజులకు పెంచారు.

Paternity leave అసలు ఉండేది కాదు. 2005 PRC సిఫార్సుల మేరకు ఇచ్చారు.

చైల్డ్ కేర్ లీవ్ 2015 PRC లో మొదటి సారిగా 60 రోజులు కల్పించారు. 2022 PRC లో దీనిని 180 రోజులకు పెంచారు.

HRA 8, 12, 20% ఉండేది.

దీనిని 12, 14.5, 20% చేశారు (2010 లో)

దీనిని 10, 12, 16% కు తగ్గించారు (2022 లో)

గ్రాట్యుటీ పరిమితి ప్రతీ PRC లో పెంచుతారు. మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపు కు కేవలం బేసిక్ నీ మాత్రమే తీసుకునేవారు. తరువాత DA నీ కూడా కలిపి లెక్కించే వారు.

పెన్షనర్లకు 1999 లో fitment కాకుండా అదనంగా 2%(1983-86 మధ్య రిటైర్ అయినా వారికి), 3% (1978-1983 మధ్య రిటైర్ ఆయిన వారికీ, 6% (1978 కన్నా ముందు రిటైర్ అయినా వారికి) వేయిటేజ్ ఇచ్చారు.

తరువాత 70 ఏళ్ల వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటం పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు.

1999 PRC కు ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యార్హతలు కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్ లు పర్సనల్ పే గా ఇచ్చేవారు. 1999 PRC వాటిని నిలిపి వేయాలని సిఫార్సు చేసింది.

1993 PRC లో మాస్టర్ స్కేల్ ఇంట్రడ్యూస్ చేయబడింది. అంతకు ముందు ఉన్న పే స్కేల్స్ లో చాలా కాంప్లెక్స్ గా ఉండేవి. (ఆ పే fixation లు experts కు మాత్రమే అర్థం అయ్యేవి)

1999 PRC నుండి DA స్థిరంగా ఉండటం మొదలయింది. అంతకు ముందు ఒక్కో బేసిక్ కు ఒక్క విధమైన DA రేటు ఉండేది.

అలాగే ఇప్పుడు ఆరు నెలకు ధరల పెరుగుదల ను బట్టి DA నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు DA రేటు 2.5% స్థిరంగా ఉండేది. అయితే ధరల పెరుగుదల ను బట్టి కొన్ని సార్లు మూడు నెలలకు పెరిగితే, కొన్ని సార్లు ఏడాదికి పెరిగేది.

ఒకప్పుడు LTC అనేది కేవలం రాష్ట్ర సరిహద్దు ల వరకే ఉండేది. తదుపరి కాలంలో సర్వీస్ లో ఒకసారి దేశంలో ఎక్కడై కైనా వెళ్ళే అవకాశం కల్పించారు.

ప్రతీ PRC ల స్పెషల్ పే, అలవెన్సులు పెంపు ఉంటుంది. అలాగే కొత్తవారికి అలవెన్సులు సిఫార్స్ చేయడం, అవసరం లేదనుకుంటే నిలివేయలని సిఫార్సు చేయడం జరుగుతుంది.

అలాగే ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషన్ అడ్వాన్స్, హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్,  మ్యారేజ్ అడ్వాన్స్, మోటార్ సైకిల్/కార్ అడ్వాన్స్, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ లాంటి అడ్వాన్స్ ల గరిష్ట పరిమితి పెంచుతూ ఉంటారు.

మా పోస్టులకు ఉండే బాధ్యతలకు మాకు ప్రొవైడ్ చేసిన స్కేల్స్ సమంజసం గా లేవని పెంచాలని రిప్రిజెంటేశన్ లు ఇస్తే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికి సిఫార్స్ చేస్తారు.

ఇలా PRC అంటే ఎన్నో ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Let's find out about PRC, ir, fitment, da, past pay scale"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0