The Papanashi Temple is located about a kilometer away from the Alampuram Jogulamba Temple.
అలంపురం జోగులాంబ దేవాలయానికి ఒక కిలోమీటరు దూరములో పాపనాశి దేవాలయం ఉంది.
ఈ దేవాలయం పురాతనమైనది.
ఇక్కడ శివుడు పాపనాశేశ్వరుడు.
ఈ దేవాలయానికి శ్మశాన నారాయణ దేవాలయం అనికూడా పేరు.
ఇక్కడ పితృదోషం ఉన్నవారికి పితృ దోషం పోగొట్టే ఏకైక దక్షిణభారత దేశంలో ఉన్న పుణ్య క్షేత్రము.
ఇక్కడ మహావిష్ణువు విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది కుడిచేతిలో పిండం పెట్టుకున్నట్లు గా ఉంటుంది.
ఇక్కడ పితృదోష నివారణకు పూజలు చేస్తారు.
అన్నము, ముద్దపప్పు
పరమాన్నము.
మినపగారెలు నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని పితృదోష పరిహారం చేయించుకున్నవారే భుజించవలసి ఉంటుంది.
పాపనాశేసవరస్వామి వారికి మన చేతులతో అభిషేకం చేయించి మనం తీసుకు వెళ్ళిన బిల్వపత్రాలు పూలు ఈశ్వరుని పై పెట్టించి పూజ చేయిస్తారు.
తరువాత అమ్మవారికి పూలు పండ్లు సమర్పిస్తారు.
ఇక్కడ ఇంకొక విశేషం ఉంది.ఇక్కడకు ఒక త్రాచు(నాగుపాము)వచ్చి శివుని చుట్టూ చుట్టుకొని ఉండేదని పానవట్టం పై నున్న పూలు శివునిపై ఉంచేదనిపూజారి గారు చెప్పారు.
కానీ ఇది చూసిన కొందరు పాము వల్ల హాని జరుగుతుంది అని దానిని రాళ్ళతో కొట్టారు అని తరువాత పాము కనబడడంలేదని కానీ ఎప్పుడో ఒకప్పుడు పాము ఇక్కడకు వస్తుందని , శివరాత్రి రోజున తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈశ్వరుని దర్శించి వెళుతుందని పూజారిగారు తెలియజేశారు.
మొత్తం మీద పాపనాశి దేవాలయం ప్రశాంత వాతావరణంలో చాలా హాయైన దేవాలయం.
ఇక్కడ శివలింగాలు ప్రత్యేకంగా కొన్ని పచ్చ గా మరికొంత లింగమని చెప్పారు.
జోగులాంబ దేవాలయం లోను ఇక్కడ శివలింగాలు పై ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయి.
శివలింగాల దగ్గర ఎంతసేపైనా కూర్చుని ధ్యానం గాని శ్లోకాలు చెప్పుకోవచ్చు.
అలాంటి ప్రత్యేకమైన దేవాలయం పాపనాశి దేవాలయం.
🙏 ఓం నమఃశ్శివాయ. 🙏
🙏 నమఃశ్శివాయ ఓం. 🙏
0 Response to "The Papanashi Temple is located about a kilometer away from the Alampuram Jogulamba Temple."
Post a Comment