Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NEET UG 2025 Registrations

 NEET UG 2025 Registrations నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు చేసుకొనే విధానం.

NEET UG 2025 Registrations

నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు మార్చి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ - యూజీ (NEET UG 2025) పరీక్షకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. మే 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి  07.03.25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఒకే షిఫ్టులో ఈ పరీక్ష జరగనుంది.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు.

దరఖాస్తులు:  07.02.25 నుంచి 07.03.25రాత్రి 11.50 గంటల వరకు

దరఖాస్తులో పొరపాట్ల సవరణ: 09.03.25 నుంచి 11.03.25

దరఖాస్తు రుసుం: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700; జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600; ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.1000; విదేశీ విద్యార్థులు రూ.9500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు 26.04.25 నాటికి; అడ్మిట్‌ కార్డులను 01.05.25నాటికి విడుదల చేస్తారు. 

నీట్‌ పరీక్ష తేదీ: 04.05.25 (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు)

ఫలితాలు 14.06.25 నాటికి విడుదల చేసే అవకాశం. 

దరఖాస్తు విధానం 

  • తొలుత neet.nta.nic.in వెబ్‌సైట్‌ సందర్శించాలి.
  • రిజిస్ట్రేషస్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • చెల్లుబాటయ్యేలా మీ వ్యక్తిగత సమాచారంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • లాగిన్‌ అయ్యి అప్లికేషన్‌ ఫారం పూర్తి చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయాలి.
  • మీరు ఎంటర్‌ చేసిన సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూసుకొని.. ఏవైనా మార్పులు ఉంటే చేయండి.
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి సబ్‌మిట్‌ చేయాలి.
  • మీరు దరఖాస్తు చేసినట్లుగా వచ్చిన కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకొని భద్రపరుచుకోగలరు.

బుక్లేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయగలరు.


N O T I F I C A T I O N



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NEET UG 2025 Registrations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0