Modi magic .. Delhi BJP CM candidate
Delhi new CM: మోడీ మ్యాజిక్.. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Vote Counting) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా 11 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది.
ఆమ్ ఆద్మీ (Aam Aadmi) పార్టీ 15 చోట్ల విజయం సాధించగా 5 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ మొదటి నుంచి ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చూపించలేకపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆ పార్టీ జీరో స్థానానికే పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి (Delhi CM Candidate) ఎవరనే విషయంలో గంట గంటకు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకు పర్వేశ్ సాహిబ్ సింగ్, మనోజ్ తివారీ, విజేందర్ గుప్తా, వీరేంద్ర సచ్‌దేవా పేర్లు వినిపించగా తాజాగా దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ (Sushmaswaraj) కుమార్తె బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) పేరు వినిపిస్తోంది. దీంతో ఢిల్లీ పాలన పగ్గాలు అందుకోబోయేది ఎవరు? మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.
0 Response to "Modi magic .. Delhi BJP CM candidate"
Post a Comment