Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

vasantha panchami

 vasantha panchami: ఈరోజే "వసంత పంచమి" ఇంట్లో పూజ ఎలా చెయ్యాలో వివరణ.

ఋతు సంబంధమైన పండుగ కావడంతో ఈ పండుగను వసంతపంచమి అంటారు. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు

మాఘమాసం వచ్చిందంటే మంచి రోజులు వచ్చాయనే అర్ధం . పెళ్లి మూహూర్తాలు ...అక్షరాభాస్యాలు ఇలా చాలా ఉంటాయి. రేపే వసంతపంచమి అంటే శుక్షపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంతపంచమిగా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో ఈ పండుగను వసంతపంచమి అంటారు. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు. అందులోనూ పంచమి రోజే సరస్వతీ జయంతి కూడా ఈ రోజే.

కొద్దిమంది పిల్లలు ఇంట్లో ఎంత బాగా చదివినా పరీక్షల దగ్గరకు వచ్చేసరికి వెనకబడుతుంటారు. ఆ సమయానికి చదివినది ఏదీ గుర్తురాదు. వీరికి ఇలా ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు. 

ఈ పరిహారాన్ని ఇంట్లో తల్లి లేదా తండ్రి నిర్వహించాలి. 

ఓ గ్లాసులో నీరు తీసుకోవాలి. 

ఆ గ్లాసును ఎడమచేతితో పట్టుకుని దాని మీద కుడి అరచేతిని ఉంచాలి. 

గ్లాసు పై భాగంలో అరచేతిని ఉంచిన తర్వాత "ఓం ఐం వాన్యై స్వాహా" అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఈ మంత్రం మీరు ప్రశాంతంగా చదవండి. కంగారుగా చదివితే అర్ధం మారిపోతుంది. ఆ నీటిని పిల్లల చేత తాగించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలపై సంవత్సరం మొత్తం సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. 

అంతే కాదు అమ్మవారికి ప్రత్యేక పూజ చెయ్యాలనుకునే వారు ఓ పీట తీసుకొని .. ఆ పీటపై పీటకు పసుపు రాసి బియ్యప్పిండితో స్వస్తిక్ గుర్తు, అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటీ వేసుకున్నా సరిపోతుంది. తెల్లని వస్త్రం వేసి సరస్వతి దేవీ ఫొటో ఉంచుకొండి. సరస్వతీ దేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి, వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసుకొని దీపం వెలిగించాలి. 

అమ్మవారికి బాగా సువాసన వచ్చే పూలతో పూజించాలి. "ఓం ఐం సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో చదువుకుంటూ ఉండాలి. అమ్మవారికి పాలు , పెరుగు, వెన్న , పటిక బెల్లం , తెల్లటి బెల్లం , కొబ్బరి ముక్కలు , పేలాలు , చెరుకు ముక్కలు ఇలా తీపి పదార్ధాలు అమ్మవారికి నైవేద్యం చెయ్యాలి. అమ్మవారికి సరస్వతి దేవీ ద్వాదశ నామ స్త్రోత్రం చదివినా , విన్నా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది . సరస్వతి కవచం కూడా మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "vasantha panchami"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0