They also have the opportunity to get seal loans ..! The central government is a key statement.
Mudra Loans: ఇకపై వారు కూడా ముద్ర లోన్స్ పొందే అవకాశం..! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ప్రధానంగా రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ మినహాయించడం ఒకటైతే..
ముద్ర లోన్స్ (Mudra Loans) మరొకటి. పీఎం ముద్ర యోజన స్కీమ్ (PM Mudra Yojana Scheme) కింద పేదలకు రూ.10 లక్షల లోన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో ఈ పథకం ద్వారా ఏకంగా రూ.20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ముఖ్యంగా చిన్న స్థాయి వ్యాపారులకు ఒక వరమనే చెప్పాలి. తమ వ్యాపారాలను మరో స్థాయికి విస్తరించడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు, మహిళలు, పేద ప్రజలు ఈ స్కీమ్ ద్వారా లోన్స్ పొంది వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు.
ఐతే, ఇప్పటి వరకు ఈ లోన్ వ్యాపారం చేసుకోవడాకే మాత్రమే అందించేవారు. కానీ గృహిణులు కూడా ముద్ర లోన్ పొందవచ్చని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీంతో వ్యక్తిగత ఆర్థిక అవసరాలు ఉన్నవారు, ఇంట్లోనే చిన్న వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను తర్వలో ప్రభుత్వం వెల్లడించనుంది.
ఇక, ముద్ర లోన్ లిమిట్‌ను రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచారు. ఈ లోన్ పొందాలంటే ముందుగా తరుణ్ కేటగిరి కింద లోన్ తీసుకుని.. తిరిగి సకాలంలో చెల్లిస్తే అప్పుడు తరుణ్ ప్లస్ కింద లోన్ పొందొచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే.. ముద్ర యోజన స్కీమ్ ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా, తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. ఈ లోన్‌ను ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ముద్ర యోజన స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకునే వారు (https://udyamimitra.in) వెబ్‌సైట్‌కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.
0 Response to "They also have the opportunity to get seal loans ..! The central government is a key statement."
Post a Comment