Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Farmer Registry: New digital cards have been released to farmers.

 ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ: రైతులకు కొత్త డిజిటల్ కార్డులు విడుదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ: రైతులకు కొత్త డిజిటల్ కార్డులు విడుదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ: రైతులకు కొత్త డిజిటల్ కార్డులు విడుదలయ్యాయి

ఆంధ్ర ప్రదేశ్ రైతు రిజిస్ట్రీ :: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. కొత్తగా డిజిటల్ కార్డులను అందించింది. ఈ కార్డు ఉంటేనే రైతులకు వచ్చే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా ఇకనుంచి వస్తాయి. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చూద్దాం.. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ అంటే ఏమిటి?

రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవను సులభతరం చేసి పారదర్శకంగా ఉంచుకోండి తీసుకొని రావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఇది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం. తప్పకుండా ప్రతి రైతు ఈ కార్డు దగ్గర ఈ కార్డు ఉండాలి.. లేదంటే రైతులకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమీ రావు.

ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ యొక్క అవలోకనం

రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత భూమి ఉన్న ప్రతి రైతుకు కేటాయించబడే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలకు ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది. రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్ట సంఖ్యలో అర్హులైన భూమి ఉన్న రైతులు గుర్తించడంలో తోడ్పడి, వారికి ప్రభుత్వం నుండి వివిధ సబ్సిడీలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది. ప్రభుత్వం అందించే పథకాలు నిరవధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.

పోస్ట్ పేరు ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ

వస్తువు రాష్ట్రంలోని ప్రతి రైతుకి 14 ఇంకెలా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు.

ప్రారంభం : 10-02-2025

సంస్థ : సెంట్రల్ గవర్నమెంట్ ( అన్ని రాష్ట్రాలలో రైతులకు )

వర్తింపు : మోడ్ ఆన్‌లైన్

ప్రయోజనాలు :  పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల రుణాలు, సబ్సిడీ లోన్స్

అధికారిక వెబ్‌సైట్ : apfr.agristack.gov.in/farmer-registry-ap

రైతు రిజిస్ట్రీ ప్రక్రియ ఏమిటి?

రైతులకు ఈ 14 అంకెల డిజిటల్ కార్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్డు ఉంటేనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడితే అన్ని సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ, పంటల బీమా ప్రభుత్వ పథకాలు రావాలన్న గాని ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇకపోతే ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి. క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ కార్డ్ అవసరమైన పథకాలు

ఈ 14 అంకెల డీజిల్ కార్డు ఉంటే క్రింద చెప్పిన ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. ఆ పథకాలు ఏవో చూద్దాము.

  • పీఎం కిసాన్ చెల్లింపులు
  • అన్నదాత సుఖీభవ పథకం
  • పంటల భీమా
  • పంట రుణ వడ్డీపై రాయితీ 5. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
  • రాయితీ పై సూక్ష్మ పోషకాలు
  • సూక్ష్మ సేద్యం పై రాయితీ
  • పంట రుణాలు
  • పెట్టుబడి సాయం

తదితర ప్రభుత్వ పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ కార్డు కారణంగా రైతులకు వస్తాయి. సత్వర పరిహారం అందుటకు ఉపయోగపడుతుంది. నీటిపారుదల, తెగుళ్ళ నీటి నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి ఇతర అందుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి రైతు తప్పకుండా ఈ కార్డు ని అప్లై చేసుకోగలరు.

Ap రైతు రిజిస్ట్రీ అవసరమైన పత్రాలు

ఈ ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీ రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ కావలెను. అవి

  • ఆధార్ కార్డు
  • ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్
  • పట్టాదారు పాస్ బుక్ ( భూమి రికార్డుల వివరాలు )
  • ల్యాండ్ ఓనర్ షిప్ రికార్డ్స్ ( మీకు సంబంధించి ( 1B లేదా అడంగల్ )

గమనిక : తప్పనిసరిగా రైతు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లేకపోతే ఈ కార్డు అప్లై చేయడానికి కుదరదు.

రైతు రిజిస్ట్రీని ఎలా నమోదు చేసుకోవాలి

మనము రెండు విధాలుగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అప్లై చేసుకోవచ్చు.

Farmer Registry Status Online మీ కార్డు పెండింగ్ లో ఉందో అప్రూవ్ అయిందో చెక్ చేసుకోండి

Ap Farmer Registry Card Status ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీ స్టేటస్ తెలుసుకోండి.

రైతు రిజిస్ట్రీ స్థితి :: ఇక్కడ క్లిక్ చేయండి

రైతు రిజిస్ట్రీ ఆంధ్రప్రదేశ్

ఫ్రీ గా ఆన్‌లైన్‌లో ఈ Andhar Pradesh Farmer Registry కార్డ్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్స్ ఈ క్రింద ఇచ్చాను క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి.

దశ 1 :: గవర్నమెంట్ కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ మీరు క్లిక్ చేస్తే పైన ఇమేజ్ చూపించిన విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవడం జరుగుతుంది.

దశ 2 :: తర్వాత మీరు సింపుల్గా ఫార్మర్ ఆప్షన్ పై క్లిక్ చేసి, పేజి లాస్ట్ లో క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ క్రింద ఇమేజ్ లో చూపించిన విధంగా రావడం జరుగుతుంది.

దశ 3 :: పైన ఫోటో చూపించిన విధంగా కొత్త యూజర్ అకౌంట్ క్రియేట్ చేయండి పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపిపై క్లిక్ చేయండి.

దశ 4 :: ఓటిపి మీ ఆధార్ కార్డుకి లింక్ ఐన మొబైల్ నెంబర్ కి రావడం జరుగుతుంది. సింపుల్గా ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

దశ 5 :: ఓటిపి వెరిఫై అయిపోయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి.

దశ 6 :: మళ్లీ కొత్తగా మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఇంతకు ముందే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ తిరిగి మళ్ళీ ఎంటర్ చేయండి.

స్టెప్ 7 :: ఓటిపి వెరిఫై చేసిన తర్వాత.. సింపుల్‌గా మీకు ఒక కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

దశ 8 :: మళ్లీ హోమ్ పేజీ కొచ్చి ఫార్మర్ కార్నర్ క్లిక్ చేయండి.. మీ ఓపెన్ లాగిన్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే అఫీషియల్ వెబ్‌సైట్ మీకు అవడం జరుగుతుంది.

దశ 9 :: మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి.. ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత మీ ల్యాండ్ కు సంబంధించిన డీటెయిల్స్.. ఫైనల్ గా మీ జిల్లా మీ జిల్లా మండలం మీ ఊరు ఏంచుకొని.. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh Farmer Registry: New digital cards have been released to farmers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0