Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How did India look out of space? Sunita says what

 అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కన్పించింది? సునీత ఏం చెప్పారో వివరణ.

How did India look out of space? Sunita says what

దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా పుడమిని చేరిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు.

నాసా (NASA) నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వీరు.. రోదసిలో తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి భారత్‌ (India) ఎలా కన్పించిందని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు. చాలా అద్భుతంగా కన్పించిందని తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

''భారత్‌ చాలా అద్భుతంగా ఉంది. మేం హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతీకారి.. ఆ మంచు కొండల అందాలను బుచ్‌ విల్మోర్‌ కెమెరాలో బంధించారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబయి వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు.. తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్‌లాగా పనిచేసేవి. ఇక మొత్తంగా భారత్‌ నాకు ఎలా కన్పించిందంటే.. పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్‌వర్క్‌ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కన్పించేది. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం'' అని సునీతా విలియమ్స్‌ వివరించారు.

ఇక, భారత్‌కు వచ్చే అవకాశాల గురించి ఆమె ప్రస్తావించారు. ''నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగివెళ్లాలని అనుకుంటున్నా. అక్కడి బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది'' అని సునీత ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని, అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ ఆ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు.

భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీలకు 1965 సెప్టెంబర్‌ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్‌ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. 1958లో ఆయన అగ్రరాజ్యానికి వలస వెళ్లారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How did India look out of space? Sunita says what"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0