*గుర్తింపు పొందని హాస్పటల్లో వైద్యము చేసుకున్నప్పుడు ఎలా క్లైమ్ పొందాలి తెలుసుకుందాం.*
నాలుగు రోజుల క్రితం విజయ్ బాబు గారు, విశ్రాంత ఉద్యోగులు, రాజమండ్రి ,ఫోన్ చేసి వారి మిత్రులు పెన్షనర్ కు యాక్సిడెంట్ జరిగిందని, గుర్తింపులేని హాస్పటల్లో అడ్మిట్ చేశారని, వారికి మెడికల్ రియంబర్స్మెంట్ వర్తిస్తుందా, ఆ సమాచారం పంపించమని కోరారు ,వారికి పంపించడం జరిగినది.
అత్యవసరముగా వైద్యము అవసరమైనప్పుడు గుర్తింపు పొందని హాస్పటల్లో వైద్యము పొందవచ్చని జీవో నెంబర్ 159, డేటెడ్ 2014లో కొన్ని సూచనలతో విడుదల చేశారు. అలా వైద్యం చేసుకున్న వారు ఏ విధంగా తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను పంపించుకోవాలో తెలుసుకుందాం.
*మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పంపు విధానం*
ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపునప్పుడు చికిత్స పొందిన హాస్పిటల్ ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా? అని పరిశీలించాలి.
గుర్తింపు పొందిన హాస్పిటల్ అయితే ప్రతిపాదనలు, సంబంధిత సర్టిఫికెట్లతోపాటు ఈ.హెచ్.ఎస్ లాగిన్ లో మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రతిపాదనలు పంపించాలి. విశ్రాంత ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారాను మరియు ఇతర డిపార్ట్మెంట్ల వారు మ్యాన్యువల్ గా సంబంధిత డి డి ఓ లకు సబ్మిట్ చేయాలి .
అప్లోడ్ చేసిన తర్వాత స్క్రూటినీ జరిగి ప్యాకేజీ ధరల మేరకు ఈ హెచ్ ఎస్ ట్రస్ట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిఎస్సి వారు ట్రస్ట్ మంజూరు చేసిన మొత్తం పై మంజూరు ఉత్తర్వులు ఇచ్చి డి డి ఓ లాగిన్ కు పంపడం జరుగుతుంది.*
*గుర్తింపు పొందని హాస్పటల్లో వైద్యం పొందితే ఎలా*
*అయితే గుర్తింపు పొందని హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఇహెచ్ఎస్ లాగిన్ లో అప్లోడ్ చేసిన తర్వాత, ఈ హెచ్ ఎస్ వారు ప్యాకేజీ ధరల మేరకు మంజూరు చేసి గుర్తింపు పొందని ఆసుపత్రిలో చికిత్స కనుక మంజూరు చేయబడిన ప్యాకేజీ ధరలో 10% తగ్గించి ఉత్తర్వులు ఇస్తారు.
తర్వాత విశ్రాంత ఉద్యోగులు మంజూరు చేయబడిన మొత్తాన్ని పొందడానికి రిలాక్సేషన్ కొరకు ప్రతిపాదనలు పంపుకోవాలి. అసలు, నకలు రెండు సెట్ల మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలతో పాటు చికిత్స పొందిన ఆసుపత్రిలో జినైనిటీ సర్టిఫికెట్, డి డి ఓ తో బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకొని సిఎస్సి కి దరఖాస్తు చేసుకోవాలి. సదరు ప్రతిపాదనలను సి ఎస్ సి వారు ప్రభుత్వానికి పంపి, ఆర్థిక శాఖ అనుమతి అనంతరం మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది.
Note...
1) గుర్తింపు పొందిన ఆస్పత్రిలో వైద్యం చేసుకుంటే ట్రస్ట్ నుంచి ప్రొసీడింగ్ మంజూరై వచ్చినప్పుడు సంబంధిత డి డి ఓ ద్వారా ట్రెజరీకి బిల్లు పెట్టి క్లెయిమ్ చేసుకుంటారు.
2) గుర్తింపు పొందని హాస్పటల్లో ట్రస్ట్ నుంచి మంజూరై వచ్చినా, మరల ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అనుమతి కొరకు మంజూరు కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలి గమనించగలరు.
*మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు ఎదుర్కొన్న ముఖ్య సమస్యలు*
1) మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సబ్మిట్ చేసినప్పుడు ట్రస్ట్ వారు రిమార్క్స్ పెడతారు, దీని స్టేటస్ డిడిఓ కి వస్తుంది, పెన్షనర్కు రాదు, ఈ సమాచారం తెలియకపోవడం వలన బిల్లులు చాలా లేట్ అవుతున్నాయి. ఇక్కడ సంఘాలు సంబంధిత విశ్రాంత ఉద్యోగులకు సమాచారం వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి.
2) విశ్రాంత ఉపాధ్యాయులు చాలావరకు తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను చిన్నచిన్న సమస్యలతో సమర్పించగలుగుతున్నారు, కానీ ఇతర డిపార్ట్మెంట్లు వారు తమ బిల్లులను సమర్పించడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇది అత్యంత బాధాకరమైన విషయం.
3) ఇటీవల కొంతమంది పెన్షనర్లు అధర్ దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రియంబర్స్మెంట్ బిల్లులు సమర్పించడంలో వారు ఎదుర్కొన్న కష్టాలు చూడడం జరిగినది , సంబంధిత డిడిఓలు సంతకాలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పెన్షనర్లు ఉచిత వైద్యం అందక నగదుతో వైద్యం చేయించుకుంటున్నారు అయినా, ఈ క్లైమ్ పొందడంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
బిల్లులు పొందే విధానంలో ట్రస్ట్ వారు మార్పులు తీసుకొని వచ్చి మొత్తం పొందడానికి అవకాశం కల్పించాలి, దీని కొరకు పెన్షనర్ల సంఘాలు కృషి చేయాలి, ముఖ్యంగా బిల్లులకు సంబంధించిన సమాచారం వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారు సంబంధిత డి డి ఓ తో పాటు పెన్షనర్లకు కూడా పంపించాలి .
0 Response to " "
Post a Comment