Indian Army Agnivir Recruitment 2025: 10 Passed Jobs In Army
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు విడుదల
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 :: ఎంతో కాలం నుంచి నిరుద్యోగులకు 10వ తరగతి మరియు 12వ తరగతి పాస్ అయితే చాలు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు చూద్దాం.
అర్హత
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ కొంత క్వాలిఫికేషన్ అర్హత ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఇండియన్ ఆర్మీ లేదా. అయితే ఈ ఫార్మా పోస్ట్ కు మాత్రం ఇంటర్మీడియట్ తో పాటు డి.ఫార్మా కూడా చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు 34 సంవత్సరాలలోపు ఉండాలి. అయితే ఈ వయస్సు వివిధ పోస్టులకు వివిధ రకముల గా ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు సడలింపు అనేది వారి కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ కేటగిరీకి ఎంత వయస్సు సడలింపు అనేది తెలుసుకుందాం.
BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అయితే ఏ పోస్టులకు ఎంత వయసు ఉండాలో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోగలరు.
మీ వయస్సు ప్రకారం మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు ఆ పోస్టులకు మీరు సులభంగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ఈ అగ్నివీర్ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అయితే ఈ అప్లికేషన్ ఫీజు ఏ కేటగిరీ వాళ్లకి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో చూద్దాం.
SC,ST అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
UR,OBC,EWS అభ్యర్థులకు రూ.250/-అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థులకు వివిధ టెస్ట్ లను కండక్ట్ చేసి వాటిలో అభ్యర్థుల పర్ఫామెన్స్ బట్టి వారికి పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అభ్యర్థులకు ఏ టెస్ట్ లు నిర్వహించారో తెలుసుకుందాం. ఇవ్వబడిన టెస్ట్ లను అభ్యర్థులకు అప్పగించారు.
- రాత పరీక్ష
- శారీరక పరీక్ష
- టైపింగ్ టెస్ట్
- అనుకూలత పరీక్ష
- పత్ర ధృవీకరణ
- వైద్య పరీక్ష.
ఈ టెస్ట్‌లు అన్ని పాసైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలను ఇస్తుంది.
జీతం వివరాలు:
ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన టెస్ట్ లు పాసైన అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చి వారి యొక్క పోస్టులను బట్టి వారికి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నెలకు రూ.30,000 వేల రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది, వీటిలో మళ్లీ కటింగ్స్ అన్నీ పోను ఇన్ హ్యాండ్ (చేతికి) రూ.21,000 వేల రూపాయలు ప్రతి నెల శాలరీ ఇస్తుంది.
ఎంపిక చేయబడిన అభ్యర్థులకు వారి శాలరీ అనేది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. అయితే ఏ సంవత్సరం ఎంత శాలరీ అనేది చూద్దాం.
మొదటి సంవత్సరం రూ.30,000/- ప్రతి నెల ఇస్తారు.
రెండవ సంవత్సరం రూ.33,000/- ప్రతినెల ఇస్తారు.
మూడవ సంవత్సరం రూ.36,500/- ప్రతి నెల ఇస్తారు.
నాలుగో సంవత్సరం రూ.40,000/- ప్రతి నేల ఇస్తారు.
అయితే ప్రతినెలా ఇచ్చే ఈ శాలరీలో 30% కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి:
ఈ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లైలో ఇండియన్ ఆర్మీ సదుపాయం కల్పించింది. ఈ పోస్టులకు అప్లై అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వారి అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే సమయంలో వారి పూర్తి వివరాలను ఇచ్చి అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు పే చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. ఆ పోస్టులకు సంబంధించిన ప్రారంభ మరియు చివరి తేదీలు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-03-2025
దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2025.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ తేదీల్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్షను జూన్ నెలలో నిర్వహించారు అయితే ఇంకా సరైన తేదీ ఇంకా ప్రకటించలేదు.
పరీక్ష తేదీ: జూన్ 2025
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 PDF డౌన్‌లోడ్
ముఖ్యమైన లింకులు
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025 PDF
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్
భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్
0 Response to "Indian Army Agnivir Recruitment 2025: 10 Passed Jobs In Army"
Post a Comment