Fish is nutritious birth ..! More than 300 diseases are parar to eat a single piece
చేప కాదిది పోషకాల పుట్ట..! ఒక్క ముక్క తింటే చాలు 300లకు పైగా రోగాలు పరార్
ఆరోగ్యం విషయానికి వస్తే వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ ముందుగా కూరగాయలు, పండ్లు తినాలని సిఫార్సు చేస్తారు. కానీ, వీటిలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారం కూడా మనకు కావాల్సిన పోషక వనరులు కలిగి ఉంటుంది.
అయితే, మటన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే చాలా మంది చికెన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉండే చేపలు, ఇతర సముద్ర ఆహారాలు కూడా మాంసాహార జాబితాలోకి చేరుస్తారు. ప్రతిరోజూ చేపలు తినడం వల్ల మొత్తం శారీరక పనితీరు మెరుగుపడుతుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇక్కడ మనం పోషకాలకు నిలయంగా పిలిచే ఒక చేప గురించి తెలుసుకోబోతున్నాము.
పోనో చేప.. ఇది మనకు కావాల్సిన పోషకాల నిధిగా పిలుస్తారు. దీంతో మనిషి శరీరం, ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు సమృద్ధిగా నిండివుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోనో చేపలో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలకు మంచిది. పోనో చేపలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం, భాస్వరం, అయోడిన్, మెగ్నీషియం, సెలీనియం కూడా పుష్కలంగా ఉన్నాయి.
పోనో చేపలో ఉండే విటమిన్ ఎ, దృష్టిని పదునుపెడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది కంటి రెటీనా, బయటి పొరను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు..పోనో చేపలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. అదనంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి విటమిన్ E కూడా అవసరం.
పోనో చేపలోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. పిల్లల పెరుగుదల, ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన గుండెకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. మన శరీరాలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేయవు. కాబట్టి, వాటిని సమతుల్య ఆహారం నుండి పొందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మెదడు పనితీరు, జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాదాపు 100 గ్రాముల పోనో చేప 106 కేలరీలను అందిస్తుందని చెబుతారు. అందువల్ల ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచి పోషకాహార వనరుగా పరిగణించబడుతుంది.
0 Response to "Fish is nutritious birth ..! More than 300 diseases are parar to eat a single piece"
Post a Comment