Ancestral Property
Ancestral Property: వారసత్వ ఆస్తిని అమ్మే హక్కు ఎవరికి ఉంటుందో తెలుసా ? చట్టం ఏం చెబుతోందంటే..!
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు రావడం చాలా సాధారణ విషయంగా మారిపోయింది. చాలా ఇళ్లల్లో ఏదో ఒక ప్రాపర్టీ గురించి సమస్య ఎదురవుతూనే ఉంటుంది.
ఇలాంటి గొడవలు ఎక్కువగా వారసత్వ ఆస్తి (పూర్వీకుల ఆస్తి) చుట్టే తిరుగుతాయి. చాలామందికి దీనికి సంబంధించిన చట్టాల గురించి సరైన అవగాహన ఉండదు. దీని వల్ల సమస్యలు మరింత కాంప్లికేట్ అవుతున్నాయి.
తల్లిదండ్రులతో ఆస్తి కోసం గొడవలు, కోర్టు కేసులు సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో అసలు ఆస్తులు ఎవరికి చెందుతాయి? ఎవరు అమ్మగలరు? అనే డౌట్స్ చాలామందిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అమ్మకానికి రూల్స్
వారసత్వ ఆస్తి (పూర్వీకుల ఆస్తి) అంటే నాలుగు తరాల నుంచి వస్తున్న ప్రాపర్టీ. దీన్ని అమ్మాలంటే అందరికీ అనుమతి చాలదు. అందరి సమ్మతి కావాలి. చట్టం ప్రకారం, ఈ సొత్తులో వాటా ఉన్న ప్రతి ఒక్కరూ సైన్ చేయాలి. కుటుంబంలో అందరూ ఒప్పుకుంటేనే అమ్మకు చట్టబద్ధం అవుతుంది. ఒకవేళ కొందరు ఒప్పుకొని ఒక్కరు వద్దన్నా సెల్ జరగదు. 'హిందూ సక్సేషన్ యాక్ట్ 2005' ప్రకారం, కూతుళ్లకూ సమాన హక్కు ఉంది. అందుకే అందరూ ఓకే అనకుండా ఎవరూ వారసత్వ ఆస్తులను టచ్ చేయలేరు. ఒక్క వాటాదారు మిస్ అయినా అమ్మకం చెల్లదు.
ఎవరు అమ్మగలరు?
వారసత్వ ఆస్తిని కుటుంబ పెద్ద నిర్వహణ చేయొచ్చు. కానీ అమ్మడానికి మాత్రం అందరి సమ్మతి అవసరం. కొన్ని స్పెషల్ కేసుల్లో అత్యవసరమైనప్పుడు వాటిని మేనేజ్ చేసేవాళ్లు అమ్మొచ్చు. కానీ అది కోర్టు ద్వారా నిరూపించాలి. ఉదాహరణకు, అప్పులు తీర్చడం లేదా కుటుంబ ఖర్చుల కోసం అయితే కోర్టు ఓకే చెప్పొచ్చు. కానీ సాధారణ పరిస్థితుల్లో మాత్రం అందరి అంగీకారం లేకుండా అమ్మడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదు.
అనుమతి లేకుండా అమ్మితే?
ఒకవేళ ఎవరైనా వారసత్వ ఆస్తిని అందరి ఒప్పందం లేకుండా అమ్మేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మిగిలిన వాటాదారులు లీగల్ నోటీస్ పంపొచ్చు. ఈ నోటీస్ ద్వారా అమ్మకం చెల్లదని చెప్పొచ్చు. కోర్టుకు వెళ్తే సెల్ డీడ్‌ను రద్దు చేసే ఛాన్స్ ఉంది. హిందూ లా ప్రకారం.. అందరి హక్కులను కాపాడటానికి ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఒక్కరు అమ్మినా మిగిలిన వాళ్లు కేసు వేస్తే కొన్నవాళ్లకు కూడా ఇబ్బంది తప్పదు.
సమస్యలు ఎందుకు?
ఆస్తి విషయంలో గొడవలు కావడానికి చట్టాల గురించి తెలియకపోవడమే పెద్ద కారణం. చాలామంది వారసత్వ ఆస్తి గురించి సరైన అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల కోర్టు కేసులు, ఫ్యామిలీలో గొడవలు తప్పవు. కొన్ని ఇళ్లలో తండ్రి-పిల్లల మధ్య సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. ఈ సమస్యలను అర్థం చేసుకుని, చట్టం ప్రకారం అడుగులు వేస్తే క్లారిటీ వస్తుంది. ఒక్కోసారి కేసులు కోర్టు బయట సెటిల్ అవుతాయి. అందుకే రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏం చేయాలి?
వారసత్వ ఆస్తిని (పూర్వీకుల ఆస్తి) అమ్మాలనుకుంటే ఫస్ట్ స్టెప్ అందరి సమ్మతి తీసుకోవడం. డాక్యుమెంట్స్‌లో అందరి సైన్ ఉండాలి. ఒకవేళ ఎవరైనా అమ్మకాన్ని ఒప్పుకోకపోతే కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేయొచ్చు. ఇలా చేస్తే మీ వాటా మీకు సెపరేట్ గా వస్తుంది. చట్టం ప్రకారం.. అమ్మకం తప్పుగా జరిగితే దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు ఉంది. లీగల్ సలహా తీసుకుంటే దారి మరింత సులభం అవుతుంది. ఈ రూల్స్ ఫాలో అయితే ఆస్తి విషయంలో గందరగోళం తప్పుతుంది. సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఈ స్టెప్స్ హెల్ప్ అవుతాయి.
0 Response to "Ancestral Property"
Post a Comment