Trying for Home Loan ..? If you take a loan of Rs.
Loans: హోమ్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా..? SBIలో రూ.80 లక్షల లోన్ తీసుకుంటే.. ఈఎంఐ ఎంత పడుతుందో తెలుసుకోగలరు.
SBI Home Loan: మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. ప్రస్తుత కాలంలో సొంతిల్లు ఉండడం అనేది ఒక కలగా మారిపోయింది. ఐతే, ఇప్పుడున్న ఖర్చులకు సొంతిల్లు కట్టడమనేది చాలా కష్టమైన పని.
అందుకు చాలా డబ్బు అవసరం. ఇలాంటి సమయంలో హోమ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. ఒకేసారి డబ్బు లోన్‌గా తీసుకుని.. నెలవారీ EMI రూపంలో తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టాలంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వక తప్పదు.
హోల్ లోన్ అంటే మనకు గుర్తు వచ్చేది ఎస్బీఐ. మిగతా బ్యాంకులో పోలిస్తే.. ఇందులో ఇంట్రెస్ రేట్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఐతే చాలా మందికి ఎంత లోన్ తీసుకోవాలి..? తీసుకుంటే ఎంత వడ్డీ పడుతుందనే అంశాలపై క్లారిటీ ఉండదు. ఈ అంశాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నా.. సరైన అవగాహన కల్పించేవారు ఉండరు. ఇప్పుడు SBI నుంచి 20 సంవత్సరాల కాలానికి రూ. 80 లక్షల గృహ రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
CIBIL స్కోర్ లేదా క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే, తక్కువ వడ్డీ రేటులో రుణం లభిస్తుంది. సాధారణంగా, CIBIL స్కోరు 300 మరియు 900 పాయింట్ల మధ్య ఉంటుంది. నిపుణుల ప్రకారం, కనీసం 750 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉన్న కస్టమర్లకు సులభంగా రుణం లభిస్తుంది.
వీరు పరిచయ వడ్డీ రేట్లను ఉపయోగించి రుణాలను అందిస్తారు. CIBIL స్కోర్‌ను మెరుగుపరచడానికి వినియోగదారులు ఆర్థిక లావాదేవీలలో క్రమశిక్షణ పాటించాలి. అయితే, CIBIL స్కోరు తక్కువ అయితే, రుణం పొందడం కష్టంగా ఉంటుంది, ఇంకా వడ్డీ రేటు కూడా ఎక్కువ అవుతుంది.
SBI గృహ రుణం వడ్డీ రేట్లు
ప్రస్తుతం SBI 8.25% వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. అంటే, 20 సంవత్సరాల కాలానికి SBI నుండి రూ. 80 లక్షల గృహ రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 68,165 EMI చెల్లించాల్సి ఉంటుంది.
SBI హోమ్ లోన్ కాలిక్యులేటర్ ప్రకారం, ఈ 20 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ. 83,59,661 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, 20 సంవత్సరాలలో రూ. 1,63,59,661 (రుణ మొత్తం + వడ్డీ) SBI కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
రూపాయల పరిమితి
SBI నుండి 11.45% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి రూ. 3 లక్షల గృహ రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 9,884 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు సంవత్సరాలలో మొత్తం రూ. 55,884 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ. 3,55,884 బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
0 Response to "Trying for Home Loan ..? If you take a loan of Rs."
Post a Comment