Google Maps: Your house on Google Maps? What to do.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇల్లు కనిపించాలా.? ఏం చేయాలంటే.
ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియాలంటే పక్కవారి కనుక్కుంటూ వెళ్లే వాళ్లం. కానీ ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ వచ్చేసింది. తెలిసిన అడ్రస్‌ను కూడా మ్యాప్స్‌లో చూసుకుని వెళ్లే రోజులు వచ్చేశాయ్.
అయితే మనం రోజూ ఉపయోగించే ఈ మ్యాప్స్‌లో మనకు తెలియని కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి అడ్రస్‌లు చెప్పే రోజులు పోయాయి. వెంటనే లొకేషన్ పంపించు అనే వారి సంఖ్య పెరుగుతోంది. లైవ్ లొకేషన్ ఆధారంగా ఇంటి అడ్రస్‌ను చెబుతున్నారు. ఇక వ్యాపారులు సైతం తమ వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేసుకుంటున్నారు. దీంతో ఒక చిన్న క్లిక్‌తో అడ్రస్ తెలిసిపోతుంది.
అయితే మ్యాప్స్‌లో పెద్ద పెద్ద దుకాణాలు, ముఖ్యమైన ల్యాండ్ మార్క్‌లకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మరి మ్యాప్స్‌లో మీ ఇల్లు లేదా దుకాణం కనిపించాలంటే ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇక చిన్న ఆప్షన్ ద్వారా మీ ఇంటి అడ్రస్ గూగుల్‌లో కనిపించే అవకాశం. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఫోన్‌లో లేదా బ్రౌజర్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత కింత లైన్‌లో కనిపించే 'కాంట్రీబ్యూట్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
అనంతరం కనిపించే యాడ్ ప్లేస్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
తర్వాత ప్లేస్ డీటెయిల్స్ పేరుతో ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ బిల్డింగ్ లేదా దుకాణం పేరు, పూర్తి అడ్రస్, మీ పేరు వంటి వివరాలను అందించాలి.
క్యాటగిరీ ఆప్షన్‌లో అపార్ట్‌మెంట్ లేదా రెసిడెన్షియల్, ఆఫీస్, బిజినెస్, హోటల్ వంటి ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మీ పూర్తి చిరునామాను ఎంటర్ చేయండి. చివరిగా మ్యాప్‌లో మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో సెలక్ట్ చేసుకోవాలి.
ఇక యాడ్ ఫోటోస్ పై క్లిక్ చేయండి. మీ ఇల్లు లేదా దుకాణానికి సంబంధించి ఫొటోలను ఎంపిక చేసుకోండి. చివరిగా సబ్‌మిట్ ఎంపికపై క్లిక్ చేయండి. అంతే రెండు రోజుల్లో మ్యాప్స్‌లో మీ ఇంటి అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.
దీనితో ఇకపై ఎవరైనా మీ అడ్రస్ అడిగితే. గూగుల్‌లో మీ పేరు లేదా దుకాణం పేరు చెప్తే చాలు. మ్యాప్స్‌లో సెర్చ్ చేసుకొని వచ్చేస్తారు.
0 Response to "Google Maps: Your house on Google Maps? What to do."
Post a Comment