Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Railway: The Reservation Bogi with General Ticket .. Doing so can escape a huge fine.

 ఇండియన్ రైల్వే: జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగిలో ఎక్కారా.. ఇలా చేస్తే భారీ జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.

ప్లానింగ్ లేకుండా అత్యవసరంగా రైలులో ప్రయాణం చేయాలంటే జనరల్ టికెట్ తీసుకుని రైలు ఎక్కడం ఒకటే. సాధారణంగా ఒక ప్యాసింజర్ రైలుకు జనరల్ బోగీలు తక్కువగా ఉంటాయి.

నాలుగు లేదా ఐదుకు మించి ఉండవు. ప్రయాణీకులు మాత్రం వేలల్లో ఉంటారు. దీంతో అత్యవసరంగా రైలులో వెళ్లే ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిల్లో ఎక్కేస్తుంటారు. కొన్నిసార్లు స్క్వాడ్ పట్టుకుంటే భారీగానే జరిమానా విధిస్తారు. సాధారణంగా చాలామంది జనరల్ టికెట్లతో రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కి టీటీఈలకు ఎంతోకొంత చేతిలోపెడదామనే ఆలోచనతో ఉంటారు. ఇలా చేసిన సందర్భాల్లో కూడా ఎప్పుడైనా స్వకాడ్‌కు దొరికితే అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణంగా మన దగ్గర జనరల్ టికెట్ అదనపు అదనపు జరిమానా చెల్లించకుండా కేవలం జనరల్ టికెట్ ధరకు, రిజర్వేషన్ టికెట్ ధరకు మధ్య ఉన్న తేడా రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అదేలా... ఏ సమయంలో ఉంటుందో ఇలాంట సదుపాయం తెలుసుకుందాం.

కోచ్‌లో బెర్తులు ఖాళీగా ఉంటే

రైలులోని రిజర్వేషన్ కోచ్‌లలో బెర్తులు అన్ని సందర్భాల్లో ఫుల్ కావు. కొన్నిసార్లు బెర్తులు ఖాళీగా ఉంటాయి. ఈ విషయం మనకు ముందుగా తెలియదు. కేవలం రైల్వే అధికారులు లేదా విధుల్లో ఉన్న టీటీఈలకు మాత్రమే ఏ రైలులో బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. అందుకే మనం జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగిలో ఎక్కేటప్పుడు ముందుగానే టీటీఈని సంప్రదించాలి. పలానా స్టేషన్ వరకు తాను తాత్కాలికంగా ఉండాలని, జనరల్ టికెట్ తీసుకున్నానని ఈరైలులో ఖాళీలు ఉన్నాయా అని అడగాలి. తన దగ్గరుండే చార్ట్ చూసి రైలులో ఖాళీలు ఉంటే ఏ కోచ్‌లో ఏ బెర్తులో కూర్చోవాలో చెబుతారు. ఖాళీ లేకపోతే లేవని చెప్పేస్తారు. రైలులో బెర్తులు ఖాళీ ఉన్నాయని టీటీఈ చెబితే మన నుంచి అదనపు రుసుము వసూలు చేయనున్నారు. కేవలం రిజర్వేషన్ టికెట్‌కు జనరల్ టికెట్‌కు మధ్య డిఫరెంట్ ఛార్జీ మాత్రమే వసూలు చేసి ఒక రశీదుతో పాటు బెర్తు నెంబర్ కేటాయిస్తారు. ఇలాంటి సందర్భాల్లో స్క్వాడ్ చెక్ చేసినా జరిమానా వసూలు చేస్తారు.

డిఫరెంట్ ఛార్జి ఎలా లెక్కిస్తారు

ఉదాహరణకు ఒక రైలులో స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ టికెట్ ధర రూ.400 అయితే.. జనరల్ టిక్కెట్ ధర రూ.180 అయితే స్లీపర్ క్లాచ్ రిజర్వేష్ కోచ్‌లో ఎక్కినందుకు రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అలాకాకుండా టీటీఈని అడగకుండా నేరుగా రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కితే జరిమానా వేసే అవకాశం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Railway: The Reservation Bogi with General Ticket .. Doing so can escape a huge fine."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0