It is not advisable to put a photo wallpaper on mobile.
వాస్తు చిట్కాలు: మొబైల్‌లో దేవుడి ఫొటో వాల్‌పేపర్‌గా పెట్టడం మంచిది కాదు.. ఎందుకో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే పనులు మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. అందుకే చాలా మంది ఇళ్లను కట్టుకొనేటప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారం కట్టుకుంటారు. లేదంటే ఆ దోషాలు జీవితంపై ప్రభావం చూపిస్తుంది నమ్ముతారు. కేవలం ఇంటి విషయంలోనే కాకుండా మనిషి జీవితంపై ఎన్నో రకాలుగా వాస్తు ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు నియమాలు పాటించకపోతే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని అంటున్నారు. వాస్తు ప్రకారం మొబైల్ ఫోన్ లో ఎలాంటి వాల్ పేపర్ పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మత స్థలాలు మొబైల్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా పవిత్రంగా చూసుకోవాలి. కానీ చాలాసార్లు మనం మురికి చేతులతో మొబైల్‌ను ముట్టుకుంటాం. కొంతమందికి బాత్‌రూమ్‌కు కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఈ కారణాల వల్లనే మత స్థలాలను ఎప్పుడూ ఫోన్‌లో పెట్టుకోకూడదు. అలా పెట్టి ఇలాంటి పనులు చేస్తే దేవుడిని అవమానించినట్టు అవుతుంది. ఇది జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం మీ మొబైల్ ఫోన్‌లో దేవుడి వాల్‌పేపర్‌గా ఎప్పుడూ పెట్టుకోకండి. కానీ చాలా మంది ఇదే పనిచేస్తారు. దేవుడి ఫోటో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. దండం పెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ భగవంతుడిని పవిత్రంగా, నిర్మలమైన మనస్సు, శుభ్రమైన శరీరంతో మాత్రమే పూజించాలి. కొంతమంది పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఫోన్‌లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటే గ్రహ దోషాలు కలుగుతాయట. ఇది కాకుండా మీ జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం పడుతుందట.
కొందరు దుఃఖం, కోపం, అసూయ, సంతోషం, అత్యాశ వంటి వాటిని చూపే చిత్రాలను తమ మొబైల్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి భావోద్వేగ వాల్‌పేపర్ పెట్టుకోవడం తప్పు. మీరు ఇలాంటి వాల్పేపర్ పెట్టుకుంటే మీ జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం వస్తుంది. ముఖ్యంగా ఈ వాల్పేపర్ వల్ల మీరు చాలా ఒత్తిడికి కూడా తగ్గారట.
వాస్తు శాస్త్రం ప్రకారం మీ మొబైల్ ఫోన్‌లో నలుపు, నీలం, గోధుమ లేదా ఊదా రంగులో ఎప్పుడూ వాల్పేపర్ పెట్టుకోకండి. దీని వల్ల జీవితంలో మీరు ఎప్పుడూ విజయం సాధించలేరు. అదనంగా చేసే పనిలో కూడా అభివృద్ధి ఉండదు. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌లో ఈ రంగుల్లో వాల్‌పేపర్ ఎప్పుడూ పెట్టుకోకండి.
0 Response to "It is not advisable to put a photo wallpaper on mobile."
Post a Comment