Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుండి అమలు.



ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి.

రిజర్వేషన్ టికెట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.


తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందేందుకు.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.


కొత్త టైమింగ్

ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అంటే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్ల కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ పరిశీలన తప్పకుండా గుర్తుంచుకోవాలి.


IRCTC వెబ్‌సైట్ & యాప్ మొబైల్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్‌డేట్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..


➤ IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి

➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)

➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి

➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నంబర్‌ను ఎంటర్ చేయండి

➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండి


కొత్త మార్పులు

➤ సమయం ఆదా చేయడానికి షెడ్యూల్ కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.

➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.

➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.

➤ యాప్ లేదా వెబ్‌సైట్ వాటికీ ఒకేవిధమైన సిస్టమ్ లాగిన్

➤ ఒక తత్కాల్ PNR కింద కాకుండా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.

➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0