JEE Main 2025: JEE Mains India Topper Om Prakash is the secret ..
JEE మెయిన్ 2025: JEE మెయిన్స్ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే.
కలలు అందరూ కంటారు. వాటిని కొందరు సాకారం చేసుకుంటారు. మనం అనుకున్నది సాధించాలంటే కష్టపడ్డంతో పాటు క్రమ శిక్షణ కూడా ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
తాజాగా, జేఈ పరీక్షల ఫలితాల్లో ఒరిస్సాకు చెందిన ఓం ప్రకాశ్ అనే విద్యార్థి ఫస్ట్ ర్యాంకు కొట్టి రికార్డు సృష్టించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించి అందిరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ ప్రకాశ్ జేఈ పరీక్షల్లో ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక అతడి కృషితో పాటు తల్లిదండ్రుల కష్టం కూడా ఉంది. కొడుకు భవిష్యత్తు కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు.
ఓం ప్రకాశ్ సక్సెస్ మన్త్ర
ఓం ప్రకాశ్ జేఈలో ఇంత అద్భుతమైన సక్సెస్ సాధించడానికి అతడి కష్టంతో పాటు.. మైండ్ సెట్ కూడా ఓ కారణం. నూటికి 90 శాతం మంది జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. ఓం ప్రకాశ్ గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం వృధా అంటున్నాడు. జరుగుతున్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నాడు. ఓం ప్రకాశ్ మాట్లాడుతూ..' నాకు మొబైల్ ఫోన్ లేదు. అది మన ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని నేను నమ్ముతాను. నేను ప్రతీ రోజు 8 నుంచి 9 గంటలు చదివే వాడిని. నేను ప్రస్తుతం అడ్వాన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాను' అని అన్నాడు.
కొడుకు భవిష్యత్తు కోసం తల్లి త్యాగం
ఓం ప్రకాశ్ బెహరా తల్లి స్మితా రాణి బెహరా ఒడిశా టీచింగ్ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్‌గా పని చేస్తూ ఉండేది. కొడుకు కోసం స్మిత ఉద్యోగం మానేసింది. ఓం ప్రకాశ్ చదువులకోసం ఒరిస్సా రాష్ట్రం వీడింది. అతడితో పాటు రాజస్థాన్‌లోని కోటకు వచ్చి చేరింది. గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. ఓం ప్రకాశ్ తండ్రి కమల్ కాంత్ బెహరా కూడా కొడుకు భవిష్యత్తు కోసం చాలా కష్టపడ్డాడు. అతడు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నాడు. కొడుకు కోసం ఒరిస్సానుంచి ఢిల్లీకి ఉద్యోగాన్ని మార్చుకున్నాడు. తరచుగా కొడుకు దగ్గరకు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఓం ప్రకాశ్‌కు ఎమోషనల్ సపోర్టుగా నిలుస్తున్నాడు.
0 Response to "JEE Main 2025: JEE Mains India Topper Om Prakash is the secret .."
Post a Comment