MBIPC Benefits: Intermates in Inter .. New Changes and Marks In Inter.
MBiPC ప్రయోజనాలు : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూప్.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ.
ఇంటర్మీడియట్‌లోని ఎంపీసీ, బైపీసీ కోర్సుల గురించి మనకు తెలుసు. ఎంబైపీసీ కోర్సు గురించి మనకు తెలియదు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఏపీలో ఎంపీపీ కోర్సు అందుబాటులోకి వచ్చింది.
ఈ కోర్సులో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమెస్ట్రీ అంటే నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్ తర్వాత వీలైనన్ని ఎక్కువ కెరీర్ అవకాశాలను చూపించే కోర్సుగా ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఎంపీపీ గ్రూప్ అందుబాటులో ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ కోర్సు లేదు.
ఏ కోర్సు చదివితే.. ఏ కెరీర్.. ?
వాస్తవానికి ఎంబైపీసీ కోర్సును సీబీఎస్ఈ(MBiPC ప్రయోజనాలు) ఇప్పటికే అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ కొన్నిచోట్ల ఈ గ్రూపులను అందజేస్తున్నారు. ఎంపీసీ చదివితే ఇంజినీరింగ్ సంబంధిత కెరీర్ అవకాశాలను అందుకోవచ్చు. బైపీసీ చదివితే మెడిసిన్, ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఎంబైపీసీ చేస్తే విద్యార్థులకు మ్యాథ్స్, బయాలజీ వాటిపైనా పట్టు పెరుగుతుంది. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ ఎటువైపుగా వెళ్లొచ్చు. బయాలజీతో పాటు మ్యాథ్స్ చదివిన వారికి బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాల్లో జాబ్స్ వస్తాయి.
కొత్త మార్పులు, కొత్త మార్కులు
ఇప్పటివరకు ఇంటర్ కాలేజీల్లో వృక్షశాస్త్రం(బోటనీ), జంతుశాస్త్రం(జువాలజీ) వంటి సబ్జెక్టులు మీరుగా ఉండేవి. ఇప్పుడు ఆ రెండు సబ్జెక్టులను కలిపి జీవశాస్త్రం (బయలజీ)గా ఏపీలో తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రం ప్రశ్నపత్రం 85 మార్కులకు ఉంటుంది. ఇందులో వృక్షశాస్త్రానికి 43 మార్కులు, జంతుశాస్త్రానికి 42 మార్కులు ఉంటాయి.
ఇప్పటిదాకా భౌతిక, రసాయన శాస్త్ర పేపర్లకు 60 మార్కులు చొప్పున ఉండేవి. ఇకపై 85 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ను నిర్వహించారు.
ఇప్పటివరకు మ్యాథ్స్ -ఎ, బి సబ్జెక్టులు ఉండేవి. వాటిని కలిపి ఒకే సబ్జెక్టుగా మార్చారు. ఇప్పటివరకు మ్యాథ్స్ ఏ, బీ పేపర్లకు 75 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండగా, ఇపుడు ఈ రెండు పేపర్లు కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
ఎంపీసీ, బైపీసీగా చదివితే, ఇంగ్లీషుతోపాటు సెకండ్ లాంగ్వేజీ కింద తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళం, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ ఎంపికలు ఉన్నాయి. ఎంబైపీసీ తీసుకుంటే ఇంగ్లీష్ ఒక్కటే చదివితే సరిపోతుంది. సెకండ్ లాంగ్వేజీ ఆప్షన్ తీసుకోనక్కర్లేదు.
మొత్తంగా ఎంబైపీసీలో గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులు ఒక్కోటి 100 మార్కుల చొప్పున ఉన్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ (100 మార్కులకు) లాంగ్వేజీగా ఉంటుంది.
మార్కుల విధానంలోనూ మార్పులు చేసి మొత్తం వెయిటేజీ 1,000 (రెండేళ్లకు) మార్కులు వచ్చేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది.
0 Response to "MBIPC Benefits: Intermates in Inter .. New Changes and Marks In Inter."
Post a Comment