Reserve Bank of India is a big shock to the new Rule Consumers on gold loans.
బంగారం రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ వినియోగ దారులకు పెద్ద షాకే.
బంగారం రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన తాజా ఆంక్షలతో.. ఆ ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకులు నిబంధనలు మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ కారణంగా..
బ్యాంకు లోన్ల నెలవారీ చెల్లింపు గడువు 12 నెలలకే పరిమితం కానుంది. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. బంగారంపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే గడువు 36 నెలల నుంచి 12 నెలలకు కుదించడం జరిగింది.
ఆర్బీఐ విధించిన ఈ కొత్త నిబంధనల కారణంగా బ్యాంకు రుణాలపై ఆసక్తి చూపించే కస్టమర్లు దూరమవుతారని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అందుకే.. ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూనే కొన్ని వెసులుబాట్లను వినియోగించుకుని గోల్డ్ లోన్ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. లో సిబిల్ స్కోర్ కారణంగా ఎక్కువ మంది కస్టమర్లు గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు.
భారతీయుల దగ్గర సహజంగానే బంగారం ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా మార్కెట్లోకి వచ్చి, లోన్లుగా మారితే ఎకానమీకి బూస్ట్ అవుతుంది. మరింత త్వరగా రికవరీకి అవకాశాలు ఉంటాయి. డిమాండ్ పెరుగుతుంది. భారతీయులకు సహజంగానే బంగారంతో అనుబంధం ఎక్కువ. మన కల్చర్‌లో ఇదొక భాగం. లోన్లు తీసుకోవడానికే కాదు పెట్టుబడులకు కూడా పసిడిని ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ లోన్లు ఎంతో సేఫ్. బాకీ వసూలు కాదన్న బెంగ అక్కర్లేదు. అందుకే బ్యాంకులు వీటిని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నాయి. మిగతా అన్‌సెక్యూర్డ్ లోన్లను పెద్దగా ఇవ్వడం లేదు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పల్లెటూళ్లలో అప్పులు పుట్టడం కష్టంగా మారింది. అయితే చాలా మంది ఇండ్లలో బంగారం బాగానే ఉంది. వాటితో బ్యాంకు లోన్లు తీసుకొని ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డీ భారం కూడా తక్కువగా ఉంటుంది. సాగుకు అవసరమైన పెట్టుబడిని సులువుగా సమకూర్చుకోవచ్చు.
0 Response to "Reserve Bank of India is a big shock to the new Rule Consumers on gold loans."
Post a Comment