If this ice is named in the refrigerator, you can take these precautions.
రిఫ్రిజిరేటర్లో ఈ ఐస్ పేరుకు పోతోందా ఐతే ఈ జాగ్రత్తలు తీసుకోగలరు.
ఇంట్లో ఉండే వస్తువులకు సంబంధించి ఎన్నో సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో ఫ్రీజర్ లో ఉండే ఐస్ పేరుకుపోతూ ఉంటుంది. కొన్ని రకాల ఫ్రీజర్స్ లో అసాధారణంగా ఐస్ ఏర్పడడం వంటివి జరుగుతాయి.
అయితే దానిని తొలగించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా తరచుగా ఫ్రీజర్ నిండా ఐస్ ఏర్పడినప్పుడు దానిని తొలగించడం ఎంతో కష్టం. అంతేకాకుండా దీనిని తొలగించినప్పటికీ ఎంతో త్వరగా తిరిగి ఐస్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫ్రీజర్ లో ఇతర వస్తువులను పెట్టుకోవడానికి చోటు కూడా ఉండదు. ఇలా జరిగినప్పుడు ఫ్రీజర్ పాడైపోయింది అని చాలామంది భావిస్తారు. కానీ సరైన వినియోగం లేకపోవడం మరియు చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ సమస్యను ఎదుర్కొంటారు.
ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ తలుపు చుట్టూ ఉండే రబ్బర్ సీలింగ్ డామేజ్ అవుతుందో, ఫ్రీజర్ లో ఐస్ పేరుకుపోతుంది. రబ్బర్ తో ఉపయోగించిన సీలింగ్ గ్యాస్కేట్ నాణ్యత కోల్పోయినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఎప్పుడైతే రిఫ్రిజిరేటర్ పనితీరు బాగుంటుందో, ప్రతి ఆరు గంటలకు ఒకసారి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ కూలింగ్ వ్యవస్థ ఆగిపోతుంది. ఆ సమయంలో ఫ్రీజర్ లో ఉన్న ఐస్ కరిగిపోతుంది. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ డోర్ కు సంబంధించిన గ్యాస్కేట్ నాణ్యత కోల్పోతాయో, ఈ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.
ఈ విధంగా ఫ్రీజర్ లో ఐస్ ఎక్కువగా పేరుకుపోతుంది. కనుక వాటిని మార్పిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫ్రీజర్ ఉష్ణోగ్రతలను వాతావరణం ప్రకారం సెట్ చేసుకోవాలి. ఫ్రీజర్ లో ఉన్న ఆప్షన్లను ఉష్ణోగ్రత ప్రకారం సెట్ చేస్తే ఈ సమస్య ఎదురవ్వదు. సరైన అవగాహన లేకపోవడం, ఒకే ఆప్షన్ ఉండడం వల్ల ఫ్రిజ్ లో ఐస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువసేపు ఫ్రీజర్ డోర్ తీసి ఉంచుతారో, ఫ్రిజ్ లో ఐస్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఫ్రిజ్ తీసిన తర్వాత పూర్తిగా మూయకపోవడం వల్ల ఐస్ కరిగే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఈ విధంగా ఐస్ పేరుకుపోతుంది. కనుక ఇటువంటి పొరపాట్లను చేయకుండా ఉంటే ఫ్రీజర్ లో ఐస్ పేరుకుపోకుండా ఉంటుంది.
0 Response to "If this ice is named in the refrigerator, you can take these precautions."
Post a Comment