These are good muhartas for those who get married in April, May and June.
ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో పెళ్లి చేసుకొనే వారికీ మంచి ముహుర్తాలు ఇవే.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి(wedding) చాలా ముఖ్యమైనది. వివాహ బంధంతో ఒకటైన ఇద్దరు వ్యక్తులు చివరి వరకు జంటగా జీవనం సాగిస్తారు.
పెళ్లితో రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడుతుంది. జీవిత పయనంలో రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా గడుపుతుంటారు. పెళ్లి అంటేనే ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలకు సంబంధించి ముఖ్యమైన అంశం కాబట్టి హిందూ మతంలో చాలా ప్రాధాన్యతనిస్తారు.
అందుకే పెళ్లి చేయాలంటే.. పెద్దలు మంచి రోజులు ఎప్పుడున్నాయో అని వేచి చూస్తారు. పెళ్లి చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. జ్యోతిష్యులను కలిసి మంచి ముహూర్తాలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో గ్రహాలు, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా? అని ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తరుణంలో పెళ్లిళ్ల(wedding) కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందింది. ఈ వేసవి కాలంలో శుభకార్యాల ఘడియలు వచ్చేశాయి. ఈ ఏడాది మంచి ముహుర్తాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
మంచి ముహూర్తాలు ఇవే.
రేపటి(బుధవారం) నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు.
ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30,
మే 1,3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30
జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు.
ఇక పోతే.. జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢమాసంలో ముహుర్తాలు లేవని.. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసంలో మంచి రోజులు ఉన్నాయన్నారు. కాగా ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు అధికంగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు సిద్ధం అవుతున్నారు.
0 Response to "These are good muhartas for those who get married in April, May and June."
Post a Comment