Why go to temples? If someone asks .. This is the answer.
దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే..ఇదిగో ఈ సమాధానాన్ని చూపెట్టండి.
ఎన్నో చరిత్రాత్మకమైన, పురాతనమైన దేవాలయాలు మన దేశంలోనే కాదు, ఇంకా అనేక ప్రాంతాలనూ ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి హిందువులు దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేస్తున్నారు.
ఇక ఉత్సవాలు వచ్చినప్పుడైతే భక్తుల్లో ఉంటే కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్నట్టు ఎదురు చూస్తారు. ఇక పండుగలు వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. అయితే నిజంగా అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్తారో తెలుసా..? మన ఇండ్లలో కూడా దేవుళ్లు ఉంటారు. దేవాలయాల్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఆలయాలకే ఎందుకు వెళ్లి దేవుళ్లను పూజించాలి..? ఇంట్లోనే ఎందుకు పూజించకూడదు..? వీటికి కారణాలు తెలుసుకుందాం రండి.
ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగేకే అందుకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట సానుకూల శక్తి చాలా ఉంటుంది. అది గుడి ముఖ ద్వారం గుండా బయటికి వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండటంతో అక్కడ సాక్షాత్తు దేవుళ్లు, దేవతలు తిరుగుతారట. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకూడదట. అందుకే ఆలయానికి చెప్పులను అనుమతించారు. చెప్పులు వేసుకుని వెళ్లరు. ఇక దేవాలయాల్లో ఉంటే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాన్నుంచి వచ్చే ధ్వని 7 సెకండ్ల పాటు ఉంటుందట. ఈ ధ్వని మన మెదడులో ఉన్న కుడి, ఎడమ భాగాలను ప్రేరేపిస్తుంది. దీనితో శరీరంలో ఉన్న 7 ప్రధాన వ్యాధినిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై, పటిష్టమవుతాయట. దీని వల్ల మనకు ఉన్న అనారోగ్యాలు నయమవుతాయట.
ఆలయాల్లో ఉన్న కుంకుమను నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ధరిస్తే దానితో మనకు పాజిటివ్ శక్తి లభిస్తుందట. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలను పెంచుతుందట. ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరాలను వెలిగించి స్వామివార్లకు హారతులు ఇస్తారు. ఆ సమయంలో వచ్చే పొగను పీలిస్తే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాదు, హారతి వెలుగులో స్వామివార్లను దర్శించుకోవడం మంచిదట. హారతిని చేతితో తీసుకుని దాన్ని కళ్లకు అద్దుకుంటే దాని వల్ల కళ్ల ఉంటే నాడులు ఉత్తేజితమవుతాయట. బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడి పూజ కోసం ఉపయోగిస్తారు కదా. వాటి నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయి.
ఇక చివరిగా దేవాలయాల్లో స్వామి వారికి నైవేద్యాలుగా ఎక్కువగా కొబ్బరికాయ, అరటిపండ్లను పెడతారు కదా. నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయట. పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే దేవాలయాలకు వెళ్లడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ఆలయాలకు కచ్చితంగా వెళ్లాలని. దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
0 Response to "Why go to temples? If someone asks .. This is the answer."
Post a Comment