Apply for a new ration card in AP? That certificate is not required. This is the case.
ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా?. ఆ సర్టిఫికెట్ అవసరం లేదు. వివరాలు ఇవే.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డు జారీకి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబాలలో రేషన్ కార్డుల విభజన అంటే... తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లున్న వారికి వివాహాలైనా వారు కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.
అలాగే రేషన్ కార్డులలో కుటుంబసభ్యుల చేరికలు, తీసివేత కోసం అవకాశం ఇచ్చారు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలు, ఇప్పటికే వేరు కాపురం వెళ్లిన వారు... చాలా మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు ఆధార్‌తోపాటు వారి వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం జత చేయాలి పరిస్థితి ఉంది. ఈ నిబంధన కారణంగా కొన్ని వివాహాలు జరగాల్సిన సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మంది దగ్గర వివాహ సర్టిఫికెట్లు లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు ఐదు, పదేళ్ల క్రితం పెళ్లైనా వారు ఇప్పుడు ఎలాగోలా వివాహ పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన తాకిడి కనిపిస్తుంది. అయితే ఈ నిబంధనపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతన్న ప్రభుత్వం స్పందించింది.
అయితే అటువంటి వారికి వివాహ సర్టిఫికేట్ అవసరం లేదని, అది తప్పనిసరి కాదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే స్వచ్ఛందంగా రేషన్ కార్డు వదులుకునేందుకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం డిలీషన్ సర్వీస్ కూడా ఉందని చెప్పారు. ఇక, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మే 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముందుగా కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే వాట్సాప్ ద్వారా (మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్) కూడా ఈ సర్వీస్‌ను అందజేయనున్నట్టుగా ప్రభుత్వం అందిస్తుంది.
0 Response to "Apply for a new ration card in AP? That certificate is not required. This is the case."
Post a Comment