Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

GOLD RATE: Rs. 29,000 reduced gold prices

 బంగారం ధర: 12 గంటల వ్యవధిలో రూ. 29,000 తగ్గిన బంగారం ధర.. ట్రంప్ దెబ్బకు పతనం అవుతున్న పసిడి.ఇక పుత్తడి ధరలు భారీగా పతనం.

బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాల్లో పర్యటన సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

ముఖ్యంగా సిరియా విషయంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా వైఖరిని మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు సౌదీ అరేబియాతో చేసుకున్న భారీ ఒప్పందం కూడా మార్కెట్లకు ఊపు ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. . ఫలితంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదు అవుతాయో అప్పుడు బంగారం ధరలు ఆటోమేటిక్ గా తగ్గడం ప్రారంభిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం. అమెరికా కామెక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్ చేంజ్ లో పసిడి ధరలు ప్రస్తుతం ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 3150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు పసిడి ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి అయిన 3500 డాలర్ల నుంచి దాదాపు 350 డాలర్లు పతనం అయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 29000 రూపాయలు అంచనా వేయవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ఫ్యూచర్స్‌లో తగ్గుతున్న ధరలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యూచర్స్ ధరలు తగ్గినప్పుడు రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం దేశీయ MCX ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రామ బంగారం ధరలు గమనిస్తే 10 గాను జూన్ 5వ తేదీ ఫ్యూచర్స్ ధర రూ. 93,159 పలుకుతోంది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ కి, రిటైల్ మార్కెట్ మధ్య తేడా ఉంటుంది. రిటైల్ మార్కెట్‌లో ప్రతిబింబించాలి అంటే కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం హైదరాబాదులో బంగారం ధర 94 వేల రూపాయలకు చేరుకున్నట్లు రిటైల్‌లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు ఆల్ టైం నుంచి పోల్చి చూస్తే దాదాపు 7వేల రూపాయల వరకు తగ్గినట్లు గమనించవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "GOLD RATE: Rs. 29,000 reduced gold prices"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0