Indian Railway New Rules
ఇండియన్ రైల్వే కొత్త రూల్స్: 2 15 నుంచి కొత్త రూల్స్.. వీరికి స్లీపర్, ఏసీ బోగీల్లోకి ప్రవేశం లేదు!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కోసం భ ఎప్పటికప్పుడూ కొత్త నియమాలను అమలు చేస్తూ ఉంటుంది. మే 15 నుంచి జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు... స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
కొత్త నియమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మే 15 నుంచి ఇండియన్ రైల్వే కొత్త నియమాన్ని అమలు చేయనుంది. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకూడదు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యను పరిష్కరించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
ఏసీ, స్లీపర్ రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లోకి రావడం వల్ల రిజర్వేషన్ చేయించుకున్నవారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ బెర్తులను అక్రమంగా ఆక్రమించడాన్ని నియంత్రించడానికి రైల్వే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్ ఉన్నవారికి ఈ చర్య మేలు చేసినా.. జనరల్ టికెట్ ఉన్నవారికి కాస్త ఇబ్బంది. వాళ్లు ఇప్పుడు కచ్చితంగా కేటాయించిన బోగీల్లోనే ఉండాలి. ఈ రూల్ ప్రకారం రైల్వే ఉద్యోగులు, రిజర్వేషన్ లేని ప్రయాణికులు, అనుమతిలేని వ్యాపారులు కూడా స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకూడదు.
రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను ఈ కొత్త నియమం పెంచుతుందని రైల్వే చెబుతోంది. అనుమతిలేని ప్రవేశాన్ని ఆపడం ద్వారా భద్రత, పరిశుభ్రత పెరుగుతాయని రైల్వే భావిస్తోంది. రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే బెర్తుల్లో కూర్చోవడాన్ని ఇది నిర్ధారిస్తుంది.
ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ఫర్ని, బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవాలని రైల్వే సూచిస్తోంది. వెయిటింగ్ జాబితా టికెట్లు ఉంటే, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి. రైల్వే చేసిన ఈ మార్పు మంచి ప్రయాణ అనుభవానికి దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు.
0 Response to "Indian Railway New Rules"
Post a Comment