Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Ration Card

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

కొత్త రేషన్ కార్డు : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో ఆశతో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

 జూన్ నెల నుంచి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులు వచ్చాయి. రేషన్ సేవలను మరింత సులభతరం చేయడానికి ఈ నెల 15 నుండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు ప్రారంభమవుతాయి. దీనికోసం 95523 00009 అనే నంబర్‌కి "హలో" అని మెసేజ్ పంపితే సరిపోతుంది.

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

New Ration Card : కొత్త రేషన్ దారులు ఈ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోండి..లేదంటే మీకు రేషన్ కార్డు రానట్లే

కొత్త రేషన్ కార్డు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం.1.2 లక్షలకు లోపుగా ఉండాలి. అదనంగా GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్‌లో పేరు నమోదై ఉండాలి. కుటుంబంలో ఎవరికీ ఇప్పటికే రైస్ కార్డు ఉండకూడదు. అవసరమైన డాక్యుమెంట్ల విషయానికొస్తే, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తప్పనిసరి. రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చాలంటే, భార్యకు మ్యారేజ్ సర్టిఫికెట్, పిల్లలకైతే బర్త్ సర్టిఫికెట్, ఆధార్ అవసరం. అదనంగా, వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో కూడా సమర్పించాలి.

ఒకే రేషన్ కార్డులో రెండు కుటుంబాలు ఉండగా, కొత్తగా విడిగా కార్డు తీసుకోవాలనుకుంటే, కనీసం నలుగురు సభ్యులు ఉండాలి. అలాంటి సందర్భాలలో సంబంధిత ఆధార్ కార్డులు, వివాహ ధృవీకరణ పత్రాలు, మరియు రేషన్ కార్డు జిరాక్సులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం సచివాలయంలో ఉంటుంది. అవసరమైన రుసుముతో పాటు పత్రాలు సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారులు పరిశీలించి కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సులభంగా రేషన్ కార్డు లభించనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Ration Card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0