Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Doing this with tamarinds every day will be completely controlled.

 తమలపాకులతో ప్రతిరోజూ ఇలా చేస్తే షుగర్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది.

Doing this with tamarinds every day will be completely controlled.

ఈమధ్య కాలంలో వయసుతో సంబంధంలేకుండా చాలా మందిలో వినిపిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది డయాబెటీస్ అనే చెప్పాలి. ప్రతీ పదిమందిలో నలుగురు షుగర్ వ్యాధితో భాదపడుతున్నారంటే దాని ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు

వారసత్వంగా కావచ్చు లేదా జీవన విధానంలో వస్తున్న మార్పులు కావచ్చు రోజురోజుకి ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర లేమి, ఒత్తిడి లాంటివి యువతలో డయాబెటీస్ సమస్య రావడానికి కారణం అవుతున్నాయి. షుగర్ వ్యాధి అనేది క్రమంగా గుండె, మెదడు, మరియు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంది. రక్తంలో ఉండే ఇన్సులిన్ అసమానత కారణంగా షుగర్ వ్యాధి వస్తుంది. అందుకే రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉండటం చాలా అవసరం.

అందుకోసం మన రోజువారి ఆహరంలో చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అందులో ప్రధానమైనది తమలపాకు. పూర్వకాలంలో రోజువారి ఆహారంలో తమలపాకు ఒక భాగంగా ఉండేది. భోజనం తరువాత తప్పకుండా తమలపాకులు నమిలేవారు మన పూర్వీకులు. తమలపాకు డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. భోజనం తరువాత రెండు లేదా మూడు తమలపాకులను నమలడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ప్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది. తాజా తమలపాకులో విటమిన్ సి, కాల్షియం, నియాసిన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

కేవలం డయాబెటీస్ కే కాకుండా తమలపాకు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తేపులు, అజీర్తి, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులో సున్నం కాకుండా సోంపు, గుల్కంద్, డ్రై ఫ్రూట్స్ కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. చర్మంపై ఉండే అలర్జీ, దురదను తగ్గిస్తుంది. కాబట్టి.. తమలపాకును రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Doing this with tamarinds every day will be completely controlled."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0