PhonePe Google Pay New Rules
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా? నేటి నుంచి కొత్త రూల్స్
PhonePe Google Pay New Rules: ఒకప్పుడు డబ్బులు ఒకరి నుంచి మరొకరికి పంపడానికి నేరుగా వెళ్లేవారు.. ఆ తర్వాత బ్యాంకు నుంచి పంపేవారు. కానీ ఎప్పుడైతే మొబైల్ రంగంలోకి వచ్చిందో.అప్పటినుంచి మనీ ట్రాన్సాక్షన్ కోసం బ్యాంకులో క్యూ కట్టడం లేదు. నేరుగా వెళ్లడం లేదు. ఉన్నచోట నుంచే కావలసిన వారికి డబ్బులు పంపిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ లో కేవలం ఫోన్ పే, గూగుల్ పే ఉంటే చాలు. కూరగాయలు అమ్మే వారి నుంచి పెద్ద వ్యాపారం నిర్వహించే వారి వరకు నేటి కాలంలో అందరూ ఈ రెండు యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వీటి ద్వారా డబ్బులు పంపడానికి బ్యాంకు ఖాతాను లింకు చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాంకు నుంచే ఆర్థిక వ్యవహారాలు జరపాలి. ఇందుకోసం ఈ రెండు యాప్ లు కొన్ని నిబంధనలు విధిస్తుంది. తాజాగా ఆ నిబంధనలో కొన్ని మార్పులు చెందాయి. ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి.అవేంటంటే?
యూపీఐ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయడం చాలా సులభంగా ఉండడంతో చాలామంది దీనికి అలవాటు పడిపోయారు. అయితే వీటికి రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు.. ఓవర్ లోడ్ కారణంగా తాజాగా జాగా వీటి యాజమాన్యం కొన్ని కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ రెండు యాప్స్ నుంచి డబ్బులు పంపించుకోవడం మాత్రమే కాకుండా బ్యాలెన్స్ చెకింగ్ కూడా అవకాశం ఉండేది. ఎప్పుడంటే అప్పుడు.. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా.. ఎలాంటి అదనపు చార్జీలు పడేవి కావు. కానీ ఇకనుంచి ఒక యూజర్ రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేస్తే చార్జీలు పడే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చూపించేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. దీంతో చాలావరకు బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసే అవసరం ఉండకపోవచ్చు.
కొందరు బిల్లులు చెల్లింపులను ఫోన్ పే ద్వారా చెల్లిస్తారు. అయితే వెళ్లి చెల్లించే సమయానికి గడువు తేదీ గుర్తు ఉండకపోవచ్చు. దీంతో ఆటో పే ఏర్పాటు తీసుకుంటారు. ఇది ఇప్పటివరకు ఏ సమయంలోనైనా ఆటో పే జరిగేది. కానీ ఇకనుంచి కొన్ని సమయాల్లో మాత్రమే ఆటోమేటిక్ బిల్లు పే జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపు.. రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే జరుగుతాయి. ఎవరైనా బిల్లు చెల్లింపులు ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసుకుంటే వాటిని ఇతర సమయాల్లోకి మార్చుకోవాలి. లేదా గడువు తేదీకి ముందే చెల్లించడం వల్ల ఎలాంటి సమస్య రాదు.
కొన్ని చెల్లింపులు సాంకేతిక కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అయితే ఈ డబ్బులు ఎక్కడ ఆగిపోయాయో తెలుసుకునే అవకాశం కూడా ఫోన్ పే లో ఉంటుంది. దీనిని తెలుసుకోవడానికి రోజుకు మూడుసార్లు మాత్రమే అవకాశం ఇస్తారు. ఇవి కూడా 90 సెకండ్ల గ్యాబ్ తో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందువల్ల వినియోగదారులు వీటిని దృష్టిలో ఉంచుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి.
0 Response to "PhonePe Google Pay New Rules"
Post a Comment